కరాచీ: త్వరలో యూఏఈలో జరిగే మూడు టెస్టుల సిరీస్కు వెస్టిండీస్ అంగీకారం తెలిపిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తాజాగా స్పష్టం చేసింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్లో రెండు టెస్టులు మాత్రమే ఉన్నా, మరొక టెస్టు మ్యాచ్ ఆడాలన్న తమ విన్నపానికి విండీస్ బోర్డు ఆమోద ముద్ర వేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. టెస్టు మ్యాచ్లను పెంచాలనే చొరవతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, పింక్ బాల్ తో ఒక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ను అబుదాబిలో నిర్వహించే అవకాశం ఉందని షహర్యార్ అన్నారు.
దీంతో ఇరు జట్ల మధ్య వచ్చే సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో యూఏఈలో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఇందులో కొన్ని మ్యాచ్‌లను తమ దేశంలో ఆడితే బాగుంటుందని గతంలోనే విండీస్ కు పాక్ విజ్ఞప్తి చేసినా అది సత్ఫలితాన్ని ఇవ్వలేదు.
'మూడు టెస్టుల సిరీస్ కు విండీస్ అంగీకారం'
Published Sat, Jun 25 2016 8:29 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM
Advertisement