
సెయింట్ లూసియా: శ్రీలంకతో రెండో టెస్టులో ఆతిథ్య వెస్టిండీస్ ఎదురీదుతోంది. ఆఖరి రోజు 296 పరుగుల లక్ష్యంతో సోమవారం బరిలోకి దిగిన వెస్టిండీస్‌పై లంక పేసర్ కసున్ రజిత నిప్పులు చెరిగాడు. రెండో ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే స్మిత్ (1), పావెల్ (2) వికెట్లను ఒకే ఓవర్లో పడగొట్టాడు. దీంతో 8 పరుగులకే కీలకమైన రెండు టాపార్డర్ వికెట్లను కోల్పోయిన విండీస్‌ను ఓపెనర్ బ్రాత్‌వైట్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే లంచ్ విరామానికి ముందు రోస్టన్ చేజ్ (13)ను లక్మల్, తర్వాత డౌరిచ్ (8)ను ధనంజయ ఔట్ చేయడంతో విండీస్ కథ మళ్లీ మొదటికొచ్చింది.
ఈ దశలో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన హోప్ మళ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడటంతో విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. హోప్ (25 బ్యాటింగ్), బ్రాత్‌వైట్ (40 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 334/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఆటకొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 342 పరుగుల వద్ద ఆలౌటైంది. విండీస్ బౌలర్ గాబ్రియేల్ (8/62) ఎనిమిది వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment