శ్రీలంకదీ తడబాటే  | West Indies vs Sri Lanka, 3rd Test updates | Sakshi
Sakshi News home page

శ్రీలంకదీ తడబాటే 

Published Tue, Jun 26 2018 1:28 AM | Last Updated on Tue, Jun 26 2018 1:28 AM

West Indies vs Sri Lanka, 3rd Test updates - Sakshi

బ్రిడ్జ్‌టౌన్‌: పేస్‌ బౌలింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై ఇరు జట్ల బ్యాట్స్‌మెన్‌ విలవిల్లాడారు. వెస్టిండీస్, శ్రీలంకల మధ్య ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు పది వికెట్లు కూలాయి. వర్షం అంతరాయం కలిగిస్తున్న ఈ డే నైట్‌ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.

రోషన్‌ సిల్వా (3 బ్యాటింగ్‌), డిక్‌వెలా (13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. రోచ్, గాబ్రియెల్‌ రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు 132/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే ఆలౌటైంది. లహిరు కుమారకు 4, రజితకు 3 వికెట్లు దక్కాయి. కెప్టెన్‌ హోల్డర్‌ (74; 13 ఫోర్లు) రాణించాడు. వర్షం వల్ల రెండో రోజు కూడా 59 ఓవర్ల ఆటే సాధ్యపడింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement