ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో లీగ్ దశ ముగిసింది. ఆదివారం కింగ్స్ పంజాబ్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించడం ద్వారా ప్లేఆఫ్స్‌కు చేరాలన్న కింగ్స్ పంజాబ్ ఆశలు నెరవేరలేదు. ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్‌లు వరుసగా మూడు, నాలుగు స్థానాలతో ప్లేఆఫ్ప్‌కు చేరాయి.
ఇదిలా ఉంచితే, ఈ ఐపీఎల్ సీజన్‌లో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. టాప్-5లో నిలిచిన బౌలర్ల జట్లలో కనీసం ఒక్కటి కూడా ప్లేఆఫ్ప్‌కు అర్హత సాధించలేదు. లీగ్ దశ ముగిసే సరికి బౌలర్ల అత్యుత్తమ గణాంకాల ప్రకారం చూస్తే ఆండ్రూ టై(24 వికెట్లు-కింగ్స్ పంజాబ్) తొలి స్థానంలో ఉండగా, ఉమేశ్ యాదవ్(20 వికెట్లు-ఆర్సీబీ) రెండో స్థానంలో, ట్రెంట్ బౌల్ట్(18 వికెట్లు-ఢిల్లీ డేర్‌డెవిల్స్), మూడో స్థానంలో నిలిచారు. ఇక హర్దిక్ పాండ్యా(18 వికెట్లు-ముంబై ఇండియన్స్) నాల్గో స్థానంలో ఉండగా, జస్ప్రిత్ బూమ్రా(17 వికెట్లు-ముంబై ఇండియన్స్) ఐదో స్థానంలో నిలిచాడు. అయితే వీరంతా టాప్-5లో చోటు దక్కించుకున్నప్పటికీ వారు ఆడిన జట్లు మాత్రం లీగ్ మ్యాచ్‌ల వరకే పరిమితమయ్యాయి.
ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రతీ సీజన్‌లో లీగ్ దశ ముగిసేసరికి టాప్-5లో నిలిచిన బౌలర్లలో జట్లలో కనీసం ఒక జట్టైన ప్లేఆఫ్స్‌కు చేరగా, తాజాగా మాత్రం ఒక జట్టు కూడా ప్లేఆఫ్స్‌కు చేరకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment