ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇక్కడ కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కింగ్స్ విసిరిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.0 ఓవర్లలో ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్(57;42 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి జతగా రోహిత్ శర్మ(24 నాటౌట్;15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), కృనాల్ పాండ్యా(31 నాటౌట్;12 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషాన్(25), హార్దిక్ పాండ్యా(23)లు తలో చేయి వేయడంతో ముంబై విజయాన్ని సొంతం చేసుకుంది.
అంతకుముందు కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కింగ్స్ పంజాబ్ తొలి వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత కేఎల్ రాహుల్(24) వికెట్‌ను కోల్పోయింది. అయితే గేల్ హాఫ్ సెంచరీ సాధించి స్కోరు బోర్డును చక్కదిద్దాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ శతకం సాధించిన తర్వాత గేల్ పెవిలియన్ చేరాడు. దాంతో కింగ్స్ పంజాబ్ 84 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది.
ఆ తర్వాత కాసేపటికి యువరాజ్ సింగ్(14) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. ఇక కరుణ్ నాయర్(23) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోవడంతో కింగ్స్ పంజాబ్ 134 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది. చివర్లో మయాంక్ అగర్వాల్(11),అక్షర్ పటేల్(13)లు నిరాశపరచగా, స్టోయినిస్(29 నాటౌట్;15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. దాంతో కింగ్స్ పంజాబ్ గౌరవప్రదమైన స్కోరును ముంబై ముందుంచుంది.
Comments
Please login to add a commentAdd a comment