న్యూఢిల్లీ: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో చీర్ లీడర్స్‌ను నిషేధించిన బీసీసీఐపై ఆస్ట్రేలియా దేశవాళీ జట్టు బ్రిస్బేన్ హీట్ కోచ్ స్టువర్ట్ లా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చీర్ లీడర్స్ లేకపోవడంతో ఈ టోర్నీ సూపర్ బౌల్ టోర్నీని పోలి ఉందని విమర్శించారు. ‘ఈ వ్యవహారం నాకు అర్థం కావడం లేదు. చీర్ లీడర్స్ లేకపోతే టోర్నీలో మజా ఉండదు. సూపర్ బౌల్ టోర్నీలా ఉంది. నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించాలి. చీర్ లీడర్స్‌ను అభిమానులు విపరీతంగా అభిమానిస్తారు.
ఇక మిగతా దేశాల్లో కూడా ఇలాగే చేస్తారేమో’ అని లా పేర్కొన్నారు. మ్యాచ్‌ల తర్వాత జరిగే పార్టీలు క్రైమ్‌కు దారితీస్తున్నాయని అందిన నివేదికలతో పాటు ఫిక్సింగ్‌ను నిరోధించే చర్యల్లో భాగంగా బీసీసీఐ చీర్ లీడర్స్‌పై నిషేధం విధించింది.