
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారక ఉపన్యాసమిచ్చేందుకు ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పేరును ఎంపిక చేయడంపై బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పటౌడీ గురించి మాట్లాడేందుకు భారతీయ క్రీడాకారులుండగా, విదేశీయులను ఆహ్వానించడంపై బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ సాబా కరీం తీరును తప్పుబట్టారు. స్మారకోపన్యాసం ఇచ్చేందుకు పీటర్సన్ అంగీకరించడం కరీంకు ఎంతో ఆనందాన్ని కలిగించి ఉంటుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
జరుగబోయేది భారత దిగ్గజం పటౌడీ స్మారక సభనా? లేక ఇంగ్లండ్ క్రికెటర్లు సర్ లెన్ హటన్, ఫ్రాంక్ వూలీ స్మారక సభనా? అంటూ అసంతృప్తి వెలిబుచ్చారు. పటౌడీ సమకాలీనులైన ఎరాపల్లి ప్రసన్న, అబ్బాస్ అలీ బేగ్, నారీ కాంట్రాక్టర్ వంటి దిగ్గజాలు ఉండగా పీటర్సన్‌తో పటౌడీ గురించి మాట్లాడించడం తగదన్నారు. జూన్ 12న జరిగే పటౌడీ స్మారక సభలో వక్తలుగా కుమార సంగక్కర, నాసర్ హుస్సేన్, సౌరవ్ గంగూలీ, పీటర్సన్ పేర్లతో తుది జాబితాను తయారు చేయగా... ఈ నలుగురిలో నుంచి పీటర్సన్ పేరును ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment