బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్ క్రికెట్ జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి టెస్టులో విండీస్ 381 పరుగుల తేడాతో భారీ గెలుపును సొంతం చేసుకుంది. ఫలితంగా సొంతగడ్డపై అతి పెద్ద విజయాన్ని(పరుగుల పరంగా) విండీస్ సాధించింది. అదే సమయంలో ఓవరాల్‌గా విండీస్‌కు ఇది మూడో అతి పెద్ద విజయంగా నమోదైంది.
విండీస్ నిర్దేశించిన 628 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగులకే ఆలౌటైంది. నాలుగురోజు ఆటలో మొత్తం 10 వికెట్లను కోల్పోయిన ఇంగ్లండ్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. విండీస్ ఆఫ్ బ్రేక్ బౌలర్ రోస్టన్ చేజ్ దెబ్బకు విలవిల్లాడిన ఇంగ్లండ్ వరుస వికెట్లను చేజార్చుకుంది. చేజ్ ఎనిమిది వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ డబుల్ సెంచరీ సాధించడంతో విండీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 289 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 415/6 డిక్లేర్డ్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 77 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 246 ఆలౌట్
ఇక్కడ చదవండి: లారా సరసన హోల్డర్
Comments
Please login to add a commentAdd a comment