
లండన్: జూలైలో వరుసగా రెండు వారాల్లో రెండు రేసులను నిర్వహించాలని ఆశించిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) నిర్వాహకులకు నిరాశ ఎదురైంది. ఎఫ్1 రేసుల్లో పాల్గొనేందుకు వచ్చే అన్ని జట్లకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రేసు నిర్వాహకులు బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే దీనికి బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించలేదు. జూన్ 8 నుంచి బ్రిటన్‌లో అడుగుపెట్టే వారు తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని... ఈ నిబంధనలు ఎవరికీ మినహాయింపు కాదని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు వారాల తర్వాతే ఈ నిబంధనపై సమీక్షిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment