
లండన్: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2019 ప్రారంభానికి ముందే పలువురు మాజీ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్టును ప్రకటించారు. అంతేకాకుండా తమ ఫేవరేట్ జట్టే టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. అయితే అందరికంటే వినూత్నంగా ప్రయత్నించాడు న్యూజిలాండ్ మాజీ విధ్వంసకర ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్. ప్రపంచకప్‌లో సుదీర్ఘ లీగ్ మ్యాచ్‌ల్లో ఎవరు ఎన్ని గెలుస్తారో అంచనా వేస్తూ ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే తన అంచనాల ప్రకారమే తొలి రెండు రోజుల ఫలితాలు రావడంతో అందరి దృష్టి మెకల్లమ్ అంచనాలపై పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు ఇంగ్లండ్, టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు వెళ్తాయని ధీమా వ్యక్తం చేయగా.. మరో స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉంటుందన్నాడు. లీగ్‌లో ఇంగ్లండ్, టీమిండియా జట్లు ఒక్కో ఓటమి చవిచూస్తాయని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆతిథ్య ఇంగ్లండ్ చేతిలో కోహ్లి సేనకు పరాభావం తప్పదన్నాడు. ఇక ఇంగ్లీష్ జట్టును ఆసీస్ జట్టు ఓడించి తీరుతుందని అభిప్రాయపడ్డాడు. అయితే మెకల్లమ్ అంచనాలను ఆసీస్ మాజీ ఆటగాడు మార్క్ వా తప్పుపట్టాడు. మెకల్లమ్ చెప్పిన దానికంటే ఆసీస్ ఎక్కువ విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment