
బర్మింగ్‌హామ్ : ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 238 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాక్ బౌలర్ల ధాటికి ఓ దశలో 83 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన కివీస్ ఆ మాత్రం స్కోర్‌నైనా సాధించిందంటే ఆ క్రెడిట్ గ్రాండ్‌హోమ్, నీషమ్‌లకే దక్కుతుంది. ఆరంభంలోనే షాహిన్ ఆఫ్రిది(3/28) నిప్పులు చెరగడంతో కివీస్ టాపార్డర్ కుప్పకూలింది. అయితే ఆల్‌రౌండర్లు నీషమ్(97 నాటౌట్; 112 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రాండ్‌హోమ్(64; 71 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించగలిగింది. పాక్ బౌలర్లలో ఆఫ్రిది మూడు వికెట్లతో చెలరేగగా.. అమిర్, షాదాబ్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు పాక్ బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు. అమిర్ బౌలింగ్‌లో మార్టిన్ గప్టిల్(5) ఔట్ కావడంతో కివీస్ వికెట్ల పతనం ప్రారంభమైంది. మున్రో(12), టేలర్(3), లాథమ్(1)లను షాహిన్ ఆఫ్రిది పెవిలియన్‌కు పంపించి కివీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ తరుణంలో జేమ్స్ నీషమ్‌తో కలిసి సారథి విలియమ్సన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే విలియమ్సన్(41) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.
నీషమ్, గ్రాండ్‌హోమ్ అదరహో..
క్లిష్ట సమయంలో ఉన్న కివీస్‌ను ఆల్‌రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హోమ్‌లు ఆదుకున్నారు. తొలుత వికెట్ల పతనాన్ని అడ్డుకొని అనంతరం పరుగుల బోర్డును పరిగెత్తించారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో గ్రాండ్‌హోమ్ అనవసరంగా రనౌటైనా.. నీషమ్ మాత్రం చివరి వరకు ఉండి జట్టును నడిపించాడు. చివర్లో నీషమ్ మరింత ధాటిగా ఆడటంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment