de Grandhomme
-
కోహ్లి ఔట్: అదే బంతి.. బౌలర్ మారాడంతే!
క్రైస్ట్‌చర్చ్: ‘మార్చిలో ఓ లెక్క రాలేదు ఫెయిల్ అయ్యావు.. సెప్టెంబర్‌లో మళ్లీ అదే లెక్క వచ్చింది. ఏం చేస్తావ్.. ఈ లోపల ఏం నేర్చుకున్నావ్.. మార్చికి సెప్టెంబర్‌కు తేడా చూపించు’అని జులాయి సినిమా క్లైమ్యాక్స్ పవర్ ఫుల్ డైలాగ్ ఉంటుంది. ప్రస్తుతం ఇదే డైలాగ్‌ను టీమిండియా సారథి విరాట్ కోహ్లికి వర్తింపజేస్తూ నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంబరం టీమిండియాకు ఎంతో సేపు నిలవేలేదు. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (3), పృథ్వీ షా(14) ఘోరంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో టీమిండియా ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లి (14) సైతం మరోసారి దారుణంగా నిరుత్సాహపరిచాడు. ఈ సిరీస్‌లో పేలవ ఫామ్‌లో ఉన్న కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో గ్రాండ్‌హోమ్ వేసిన 18 ఓవర్ తొలి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆఫ్‌సైడ్ ఫ్రంట్ ఫూట్ బంతిని అంచనా వేయడంలో మరోసారి తడబడిన కోహ్లి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో అప్పటికే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టేస్తూ పెవిలియన్ బాట పట్టాడు. అయితే అవతలి ఎండ్‌లో ఉన్న పుజారా రివ్యూ తీసుకొమ్మని సూచించినా కోహ్లి నిరాకరించి క్రీజు వదిలి వెళ్లాడు. తర్వాత ఫర్ఫెక్ట్ అవుటని టీవీలో తేలడంతో కోహ్లి మరోసారి డీఆర్ఎస్ అవకాశాన్ని వృథా చేయలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టిమ్ సౌతీ వేసిన సేమ్ అదే బంతికే కోహ్లి అదేరీతిలో ఎల్బీడబ్ల్యూ కావడం గమనార్హం. 2018లో కేప్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సైతం కోహ్లి ఇదే విధంగా ఔటయ్యాడంటూ కామెంటేటర్లు పేర్కొన్నారు. ఇక ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మన్ ఇలా పలుమార్లు ఒకే విధంగా ఔటవ్వడం విమర్శలకు ఊతమిచ్చే అవకాశం ఉంది. కోహ్లి ఆటతీరుపై నెటిజన్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌కు రెండో ఇన్నింగ్స్‌కు తేడా చూపించలేదని.. నేర్చుకోవడంలో సారథే వెనుకంజలో ఉంటే సహచర, యువ క్రికెటర్లు అతడి నుంచి ఏం నేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. కాగా, కివీస్ టెయిలెండర్లు సులువుగా బ్యాటింగ్ చేసిన చోట భారత బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవడాన్ని టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: కోహ్లి.. అందుకే విఫలం సలాం జడ్డూ భాయ్.. -
పాక్ ఛేదిస్తుందా.. చతికిలపడుతుందా?
బర్మింగ్‌హామ్ : ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 238 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాక్ బౌలర్ల ధాటికి ఓ దశలో 83 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన కివీస్ ఆ మాత్రం స్కోర్‌నైనా సాధించిందంటే ఆ క్రెడిట్ గ్రాండ్‌హోమ్, నీషమ్లకే దక్కుతుంది. ఆరంభంలోనే షాహిన్ ఆఫ్రిది(3/28) నిప్పులు చెరగడంతో కివీస్ టాపార్డర్ కుప్పకూలింది. అయితే ఆల్‌రౌండర్లు నీషమ్(97 నాటౌట్; 112 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్రాండ్‌హోమ్(64; 71 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించగలిగింది. పాక్ బౌలర్లలో ఆఫ్రిది మూడు వికెట్లతో చెలరేగగా.. అమిర్, షాదాబ్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు పాక్ బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు. అమిర్ బౌలింగ్‌లో మార్టిన్ గప్టిల్(5) ఔట్ కావడంతో కివీస్ వికెట్ల పతనం ప్రారంభమైంది. మున్రో(12), టేలర్(3), లాథమ్(1)లను షాహిన్ ఆఫ్రిది పెవిలియన్‌కు పంపించి కివీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ తరుణంలో జేమ్స్ నీషమ్‌తో కలిసి సారథి విలియమ్సన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే విలియమ్సన్(41) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. నీషమ్, గ్రాండ్‌హోమ్ అదరహో.. క్లిష్ట సమయంలో ఉన్న కివీస్‌ను ఆల్‌రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హోమ్‌లు ఆదుకున్నారు. తొలుత వికెట్ల పతనాన్ని అడ్డుకొని అనంతరం పరుగుల బోర్డును పరిగెత్తించారు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో గ్రాండ్‌హోమ్ అనవసరంగా రనౌటైనా.. నీషమ్ మాత్రం చివరి వరకు ఉండి జట్టును నడిపించాడు. చివర్లో నీషమ్ మరింత ధాటిగా ఆడటంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. -
స్డేడియంలో క్రికెటర్ వాంతులు.. వైరల్!
-
స్టేడియంలో క్రికెటర్ వాంతులు.. వైరల్!
ముంబయి: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో పర్యాటక జట్టు న్యూజిలాండ్ క్రికెటర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్మీ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తన బౌలింగ్ ఓవర్ మధ్యలోనే వాంతులు చేసుకోవడం ప్రేక్షకులను ఆందోళనకు గురిచేసింది. తొలుత టాస్ గెలిచిన విరాట్ సేన బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 21వ ఓవర్ ను కివీస్ ఆల్ రౌండర్ డి గ్రాండ్‌హోమ్మీ వేశాడు. ఈ ఓవర్లో రెండు బంతులు వేసిన తర్వాత గ్రాండ్‌హోమ్మీ వాంతులు చేసుకున్నాడు. ఎండ తీవ్రతను తట్టుకోలేని గ్రాండ్‌హోమ్మీ ఒంట్లో ఓపిక కోల్పోయినట్లుగా రెండు మోకాళ్లపై కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. కివీస్ ఫిజియో మైదానంలో వచ్చి ఆటగాడితో మాట్లాడాడు. ఎనర్జీ డ్రింక్స్ తాగిన గ్రాండ్‌హోమ్మీ ఎలాగోలా ఆ ఓవర్‌ను పూర్తిచేసి డ్రెస్సింగ్ రూమ్ బాట పట్టాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ పీటర్ హ్యాండ్స్కంబ్ చిట్టగాంగ్‌లో ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో రెండో రోజు బ్యాటింగ్ చేస్తూ స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. రెండున్నర గంట క్రీజులో ఉన్న పీటర్ 113 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఆరోజు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఆటగాళ్లు గ్రౌండ్లో చెమట చిందించారు. అలాగే ఈ రెండున్నర గంటల్లో ఏకంగా 4.5 కేజీల బరువు తగ్గాడు. -
అరంగేట్రంలోనే పాక్‌కు చుక్కలు చూపించాడు!
క్రైస్ట్‌చర్చ్: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేసిన బౌలర్ తన తొలి మ్యాచ్‌లోనే సంచలన ప్రదర్శన చేశాడు. టెస్టు తొలిరోజు వర్షార్పణం కాగా, రెండో రోజైన శుక్రవారం కివీస్ జట్టు అరంగేట్ర బౌలర్ డే గ్రాండ్ హోమ్మీ పాక్ బ్యాట్స్‌మన్ పని పట్టాడు. తన తొలి మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే 6 వికెట్లు తీసి ప్రత్యర్థి పాక్‌ను తొలి ఇన్నింగ్స్ లో కేవలం 133 పరుగులకే పరిమితం చేశాడు. కివీస్ మిగతా బౌలర్లలో బౌల్ట్, సౌథీ చెరో రెండు వికెట్లు తీశారు. తొలి వికెట్.. లాస్ట్ వికెట్.. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ స్కోరు 31 పరుగుల వద్ద పాక్ కెప్టెన్ అజహర్ అలీ(15)ని కివీస్ బౌలర్ గ్రాండ్ హోమ్మీ బౌల్డ్ చేసి టెస్టు కెరీర్లో తొలి వికెట్ తీశాడు. ఆ తర్వాత రెండు వరుస ఓవర్లలో బాబర్ అజాం(7), స్టార్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్(2) లను పెవిలియన్ బాట పట్టించాడు. సోహైల్ ఖాన్ వికెట్ తీసి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల వీరుడిగా నిలిచిన హోమ్మీ.. రహత్ అలీని డకౌట్ చేసి ఆరో వికెట్ దక్కించుకోవడంతో పాటు పాక్ తొలి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.