ముంబయి: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో పర్యాటక జట్టు న్యూజిలాండ్ క్రికెటర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్మీ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తన బౌలింగ్ ఓవర్ మధ్యలోనే వాంతులు చేసుకోవడం ప్రేక్షకులను ఆందోళనకు గురిచేసింది. తొలుత టాస్ గెలిచిన విరాట్ సేన బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 21వ ఓవర్ ను కివీస్ ఆల్ రౌండర్ డి గ్రాండ్‌హోమ్మీ వేశాడు. ఈ ఓవర్లో రెండు బంతులు వేసిన తర్వాత గ్రాండ్‌హోమ్మీ వాంతులు చేసుకున్నాడు. ఎండ తీవ్రతను తట్టుకోలేని గ్రాండ్‌హోమ్మీ ఒంట్లో ఓపిక కోల్పోయినట్లుగా రెండు మోకాళ్లపై కొద్దిసేపు అలాగే ఉండిపోయాడు. కివీస్ ఫిజియో మైదానంలో వచ్చి ఆటగాడితో మాట్లాడాడు. ఎనర్జీ డ్రింక్స్ తాగిన గ్రాండ్‌హోమ్మీ ఎలాగోలా ఆ ఓవర్‌ను పూర్తిచేసి డ్రెస్సింగ్ రూమ్ బాట పట్టాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ పీటర్ హ్యాండ్స్‌కంబ్ చిట్టగాంగ్‌లో ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో రెండో రోజు బ్యాటింగ్ చేస్తూ స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. రెండున్నర గంట క్రీజులో ఉన్న పీటర్ 113 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఆరోజు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఆటగాళ్లు గ్రౌండ్‌లో చెమట చిందించారు. అలాగే ఈ రెండున్నర గంటల్లో ఏకంగా 4.5 కేజీల బరువు తగ్గాడు.
Comments
Please login to add a commentAdd a comment