అరంగేట్రంలోనే పాక్‌కు చుక్కలు చూపించాడు! | on debut new zealand bowler de Grandhomme got 6 wickets | Sakshi
Sakshi News home page

అరంగేట్రంలోనే పాక్‌కు చుక్కలు చూపించాడు!

Published Fri, Nov 18 2016 8:57 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM

అరంగేట్రంలోనే పాక్‌కు చుక్కలు చూపించాడు!

అరంగేట్రంలోనే పాక్‌కు చుక్కలు చూపించాడు!

క్రైస్ట్చర్చ్: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేసిన బౌలర్ తన తొలి మ్యాచ్‌లోనే సంచలన ప్రదర్శన చేశాడు. టెస్టు తొలిరోజు వర్షార్పణం కాగా, రెండో రోజైన శుక్రవారం కివీస్ జట్టు అరంగేట్ర బౌలర్ డే గ్రాండ్ హోమ్మీ పాక్ బ్యాట్స్‌మన్ పని పట్టాడు. తన తొలి మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే 6 వికెట్లు తీసి ప్రత్యర్థి పాక్‌ను తొలి ఇన్నింగ్స్ లో కేవలం 133 పరుగులకే పరిమితం చేశాడు. కివీస్ మిగతా బౌలర్లలో బౌల్ట్, సౌథీ చెరో రెండు వికెట్లు తీశారు.

తొలి వికెట్.. లాస్ట్ వికెట్..
ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ స్కోరు 31 పరుగుల వద్ద పాక్ కెప్టెన్ అజహర్ అలీ(15)ని కివీస్ బౌలర్ గ్రాండ్ హోమ్మీ బౌల్డ్ చేసి టెస్టు కెరీర్లో తొలి వికెట్ తీశాడు. ఆ తర్వాత రెండు వరుస ఓవర్లలో బాబర్ అజాం(7), స్టార్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్(2) లను పెవిలియన్ బాట పట్టించాడు. సోహైల్ ఖాన్ వికెట్ తీసి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల వీరుడిగా నిలిచిన హోమ్మీ.. రహత్ అలీని డకౌట్ చేసి ఆరో వికెట్ దక్కించుకోవడంతో పాటు పాక్ తొలి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement