కివీస్ దెబ్బకు పాక్ విలవిల
క్రిస్ట్చర్చ్:న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 133 పరుగులకే కుప్పకూలిన పాక్.. రెండో ఇన్నింగ్స్ లో అదే తరహా పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ 105 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. పాక్ టాపార్డర్ ను కివీస్ బౌలర్లు చావు దెబ్బ తీశారు. బౌల్ట్ మూడు వికెట్లు, వాగ్నర్ రెండు వికెట్లు తీసి పాక్ వెన్నువిరిచారు. సౌతీ, గ్రాండ్ హోమ్లకు తలో వికెట్ దక్కింది.
ఈ రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ ఏడు వికెట్ల నష్టానికి129 పరుగులు చేసింది. సొహైల్ ఖాన్(22 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు 104/3 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్..200 పరుగులకు ఆలౌటైంది.