కివీస్ ఘన విజయం
క్రిస్ట్చర్చ్: రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ఇక్కడ పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ విసిరిన 105 పరుగుల లక్ష్యాన్ని కివీస్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకుముందు 129/7 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 171 పరుగుల వద్ద ఆలౌటైంది.
దాంతో న్యూజిలాండ్ కు స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించికల్గింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు రావల్(36), కేన్ విలియమ్సన్(61)లు బాధ్యాయుతంగా ఆడటంతో కివీస్ 31.3 ఓవర్లలో ఇంకా ఎనిమిది వికెట్లు ఉండగా విజయాన్ని సాధించింది.
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 133 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 171 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 200 ఆలౌట్