పాక్‌కు 74 పరుగుల ఆధిక్యం | 1st Test: Pakistan secure 74-run lead after Babar fighting fifty | Sakshi
Sakshi News home page

పాక్‌కు 74 పరుగుల ఆధిక్యం

Published Sun, Nov 18 2018 1:12 AM | Last Updated on Sun, Nov 18 2018 1:12 AM

1st Test: Pakistan secure 74-run lead after Babar fighting fifty - Sakshi

అబుదాబి: న్యూజిలాండ్‌ బౌలర్లు బౌల్ట్‌ (4/54), గ్రాండ్‌హోమ్‌ (2/30), ఎజాజ్‌ పటేల్‌ (2/64) చెలరేగడంతో తొలి టెస్టులో పాకిస్తాన్‌ 227 పరుగులకే ఆలౌటైంది. బాబర్‌ ఆజమ్‌ (62; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... అసద్‌ షఫీక్‌ (43; 5 ఫోర్లు, 1 సిక్స్‌), హరీస్‌ సొహైల్‌ (38) ఫర్వాలేదనిపించారు. ఓవర్‌నైట్‌ స్కోరు 59/2తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.

బాబర్‌ ఆజమ్‌ చివరి వరకు పోరాడటంతో పాక్‌కు 74 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 56 పరుగులు చేసింది. రావల్‌ (26 బ్యాటింగ్‌), కెప్టెన్‌ విలియమ్సన్‌ (27 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చేతిలో 9 వికెట్లు ఉన్న కివీస్‌ పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు మరో 18 పరుగులు వెనుకబడి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement