సౌతాంప్టన్: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తరుపున ఇదే తొలి శతకం కావడం విశేషం. సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(122 నాటౌట్; 144బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఒక్క పరుగు వద్ద డుప్లెసిస్ రూపంలో జీవనధానం లభించింది. రబడా వేసిన బౌన్సర్‌ను ఆడబోయిన రోహిత్.. బంతి గ్లౌవ్స్‌కు తాకి గాల్లోకి లేచింది, అయితే ఆ క్యాచ్‌ను డుప్లెసిస్ వదిలేయడంతో రోహిత్ ఊపిరి పీల్చుకున్నాడు.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. శిఖర్ ధావన్(8) పూర్తిగా నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సారథి విరాట్ కోహ్లి(18) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. దీంతో 54 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీర్దిద్దరూ మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించిన అనంతరం రాహుల్(26)ను రబాడ బొల్తా కొట్టించాడు. అయితే రోహిత్ మాత్రం తనదైన రీతిలో వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పెంచాడు. రోహిత్‌తో పాటు రాహుల్(26), ధోని(34)లు రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment