అందుబాటులో ప్రపంచకప్ వస్తువులు
వెల్లింగ్టన్: ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన వస్తువులను విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు దక్కించుకునే అవకాశాన్ని ఐసీసీ కల్పిస్తోంది. దీంట్లో భాగంగా టోర్నీ మొత్తంలో ఉపయోగించే 49 టాస్ నాణేలను, అధికారిక స్కోర్ కార్డులను కూడా వేలం ద్వారా అందుబాటులో ఉంచుతోంది. ఐసీసీకి సంబంధించిన జ్ఞాపకాలు, సేకరణకు సంబంధించి అధికారిక లెసైన్స్ ఉన్న ఎస్‌ఈ ప్రోడక్ట్స్ గత ప్రపంచకప్ సందర్భంగానూ ఇలాంటి ప్రయత్నమే చేసి విజయవంతమైంది.
ప్రతీ నాణెంపైనా ఆయా మ్యాచ్‌లకు సంబంధించిన తేదీలు ఉంటాయి. తొలిసారిగా స్కోరు కార్డును కూడా అభిమానులకు అందిస్తుండగా క్వార్టర్స్ నుంచి ఫైనల్ దాకా ఉపయోగించిన బంతులను కూడా కొనుగోలు చేయవచ్చు. www.icc-shop.com వెబ్‌సైట్‌లో ఆయా వస్తువుల కోసం బిడ్‌ను వేయవచ్చు.