టీమిండియా(ఫైల్)
దుబాయ్: వన్డే 11వ ప్రపంచకప్ లో డిపెండింగ్ చాంపియన్ భారత్ రెండో ర్యాంకుతో బరిలోకి దిగనుంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియాకు రెండో ర్యాంక్ దక్కింది. ముక్కోణపు సిరీస్ విజేత ఆస్ట్రేలియా అగ్రస్థానం కైవశం చేసుకుంది. దక్షిణాఫ్రికా మూడో ర్యాంకులో ఉంది.
బ్యాటింగ్ విభాగంలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా డీవిలియర్స్, హషిమ్ ఆమ్లా మొదటి రెండు ర్యాంకుల్లో ఉన్నారు. శిఖర్ ధావన్(7), ధోని(8) టాప్ టెన్ కొనసాగుతున్నారు. భారత్ బౌలర్లు ఎవరూ టాప్ టెన్ లో చోటు దక్కించుకోలేపోయారు. భువనేశ్వర్ కుమార్(13), రవీంద్ర జడేజా(14) మాత్రమే టాప్-20లో ఉన్నారు.