ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్
21 ఏళ్లలో ఇదే అత్యుత్తమం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 101 ర్యాంకులో నిలిచింది. గత నెలలో 132వ ర్యాంక్‌లో ఉన్న భారత్ ఏకంగా 31 స్థానాలు ఎగబాకింది. ఇటీవల 2019 ఆసియా క్వాలిఫయర్ మూడో రౌండ్‌లో 1–0తో మయన్మార్‌పై గెలవడంతో జట్టు ర్యాంక్ మెరుగైంది. భారత్ ఏఎఫ్‌సీ ఆసియా క్వాలిఫయర్స్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో విజయం సాధించింది. 1996 ఫిబ్రవరిలో భారత జట్టు అత్యుత్తమంగా 94వ ర్యాంకు సాధించింది. 1996 మేలో ఆఖరిసారిగా 101వ ర్యాంక్‌లో నిలిచిన భారత్ ఆ తర్వాత ఒక్కసారిగా దిగజారిపోయింది.
తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ ఆసియా జట్లలో 11వ స్థానంలో నిలిచింది.కోచ్‌గా స్టీఫెన్ కాన్‌స్టెంటైన్ 2015లో బాధ్యతలు తీసుకునే సరికి భారత్ 171వ ర్యాంకులో ఉంది. ఆ తర్వాత కాన్‌స్టెంటైన్ జట్టు ప్రదర్శనను మెరుగు పర్చడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అర్జెంటీనాను వెనక్కినెట్టి బ్రెజిల్ తొలి ర్యాంకుకు చేరగా.. జర్మనీ, చిలీ, కొలంబియాలు తరువాత స్థానాల్లో నిలిచాయి.
భారత్@ 101
Published Fri, Apr 7 2017 12:47 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
Advertisement