
సాక్షి, హైదరాబాద్: డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రెజిల్‌మానియా 35 టోర్నమెంట్‌కు అభిమానుల నుంచి గొప్ప స్పందన లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ స్టార్లు ట్రిఫుల్ హెచ్, బటిస్టా బ్రాక్ లెస్నర్, సేథ్ రోలిన్స్, రోమన్ రైన్స్, రొండా రౌసీ, షార్లెట్ ఫ్లెయిర్‌లు తలపడిన ఈ పోటీలను పెద్దసంఖ్యలో అభిమానులు వీక్షించారు. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలను మెట్‌లైఫ్ స్టాండ్స్‌నుంచి దాదాపు 82,000కు పైగా అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఇదే కాకుండా సోనీ టెన్–1, సోనీ టెన్–3, సోనీ సిక్స్ హిందీ, ఇంగ్లిష్, తమిళ్ చానళ్ల ద్వారా భారతదేశంలోని అభిమానులు ఈ క్రీడా వినోదాన్ని ఆస్వాదించారు. మెగా ఫ్యాన్స్ కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలోని పీవీఆర్ మాల్స్‌లో భారీ స్క్రీన్‌లపై ప్రదర్శించారు.
చరిత్రాత్మకమైన ఈ రెజిల్ మానియా తొలిసారిగా మహిళల మ్యాచ్‌లను నిర్వహించింది. ఇందులో భాగంలో షార్లెట్ పెయిర్‌పై బెకీ లించ్ విజయం సాధించింది. డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌షిప్ టైటిల్ మ్యాచ్‌లో కోపీ కింగ్‌స్టన్ తీవ్రంగా శ్రమంచాడు. 11 సంవత్సరాల తర్వాత తలపడిన అతను స్ఫూర్తిదాయక విజయాన్ని నమోదు చేశాడు. యూనివర్సల్ చాంపియన్ టైటిల్ కోసం బ్రాక్ లెస్నర్, సేథ్ రోలిన్స్ పోటీపడ్డారు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సేథ్ రోలిన్స్ గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. నో హోల్డ్స్ బార్డ్ మ్యాచ్‌లో దిగ్గజాలు బటిస్టా, ట్రిఫుల్ హెచ్ తలపడ్డారు. రిక్ ప్లెయిర్ ఈ మ్యాచ్‌లో సహాయం అందించడంతో బటిస్టాపై ట్రిపుల్ హెచ్ గెలుపొందాడు. క్యాన్సర్‌తో పోరాడి గెలుపొందిన రోమన్‌రైన్స్ తన స్ఫూర్తిదాయక పోరాటంతో డ్య్రూ మెకిన్‌టైర్‌ను ఓడించాడు. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లంతా తమ శక్తియుక్తులు ప్రదర్శించడంతో పోరాటాలు వీక్షకులకు కనువిందు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment