
హైదరాబాద్: టీమిండియా ప్రస్తుత సారథి విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిలపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. యువీ కెరీర్ కష్టకాలంలో ఉన్నప్పుడు వీరిద్దరు అండగా నిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ మాట్లాడుతూ.. ‘యువరాజ్‌ను ఎంతో మంది వెన్నుపోటు పొడిచారు. అందులో ధోని, కోహ్లిలు కూడా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. సెలక్టర్ శరణ్‌దీప్ కూడా యూవీని జట్టు నుంచి తప్పించాలని చూశాడు’అంటూ షాకింగ్స్ కామెంట్స్ చేశాడు.
ధోని, కోహ్లిలపై యోగ్‌రాజ్ ఇలాంటి ఆరోపణలు చేయడం కొత్తేంకాదు. వన్డే ప్రపంచకప్-2011 సమయంలో యువీని తప్పించి రైనాను జట్టులోకి తీసుకోవాలని ధోని ప్రయత్నించాడని గతంలో ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. తన కొడుకు రాణిస్తే తమకు పేరు రాదనే ఉద్దేశంతోనే ధోని, కోహ్లిలు యువీ పట్ల వివక్ష చూపించేవారని యోగ్‌రాజ్ విమర్శించేవాడు. ఇక యువీ సైతం తన కెరీర్‌లో సౌరవ్ గంగూలీ నుంచి వచ్చిన మద్దతు మరెవరి నుంచి రాలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
చదవండి:
'అందుకే రైనాను పక్కన పెట్టాం'
శిఖర్ ధావన్‌ను చూడగానే ఏడ్చేశాను..