
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్‌లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ జోడి సెమీస్‌లో ఓడింది. యూకీ జంట 4–6, 6–7 (2/7)తో హెర్బెర్ట్–సిమోన్ (ఫ్రాన్స్) జోడి చేతిలో కంగుతింది. సింగిల్స్‌లో టాప్ సీడ్ మారిన్ సిలిచ్‌కు సెమీఫైనల్లో చుక్కెదురైంది. ఈ క్రొయేషియా ఆటగాడికి అన్‌సీడెడ్ గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ 89వ ర్యాంకర్ సిమోన్ 1–6, 6–3, 6–2తో ఆరో ర్యాంకర్ సిలిచ్‌ను కంగుతినిపించాడు.
2015 సెప్టెంబర్ తర్వాత సిమోన్ ఏటీపీ టోర్నీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. శనివారం జరిగే ఫైనల్లో అతను... ప్రపంచ 14వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో తలపడతాడు. మరో సెమీస్‌లో కెవిన్ 6–7 (6/8), 7–6 (7/2), 6–1తో బెనొయిట్ పైర్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment