న్యూఢిల్లీ: ఈసారి తన పుట్టినరోజు వేడుకల్ని యువరాజ్ సింగ్ ప్రత్యేకంగా జరుపుకున్నాడు. థాయ్‌లాండ్‌లో కొంతమంది సన్నిహితులతో కలిసి యువీ తన 38వ బర్త్‌డే వేడుకలు చేసుకున్నాడు. ఈ కార్యక‍్రమానికి యువీతో కలిసి క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, అజిత్ అగర్కార్‌లు హాజరయ్యారు. అతని చిన్ననాటి స్నేహితుడు గౌరవ్ కపూర్ కూడా యువీ పుట్టినరోజు వేడుకల్డో పాల్గొన్నాడు. ఇంకా మరికొంత మంది క్లోజ్ ఫ్రెండ్స్ కూడా యువీ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను యువరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గ్రూప్‌లుగా దిగిన ఫోటోలను యువరాజ్ తన ట్వీటర్ అకౌంట్‌లో పెట్టాడు. ఆ ఫోటోలకు యువీ ఒక కామెంట్‌ను కూడా జత చేశాడు. ‘ స్పెషల్ ఫ్రెండ్స్‌తో స్పెషల్ డే. గుర్తుంచుకోవడానికి ఒక రోజు.. నాకు విషెస్ తెలియజేసిన అందరికీ థాంక్యూ’ అని పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి: అతడు క్రికెట్ సూపర్‌స్టార్)
1981, డిసెంబర్ 12న యువరాజ్ సింగ్ జన్మించాడు. 1996లో అండర్-15 వరల్డ్ కప్, 2000 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్, 2007, 2011 ప్రపంచకప్‌ల్లో యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టి శభాష్ అనిపించాడు. 2000లో కెన్యాపై అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఈ సిక్సర్ల కింగ్.. చివరి వన్డేను 2017 వెస్టిండీస్‌తో ఆడాడు. 2003లో టెస్టుల్లో న్యూజిలాండ్‌తో అరంగేట్రం చేసిన యువీ 2012లో ఇంగ్లండ్‌పై తన చివరి టెస్ట్‌ను ఆడగా, ఇక చివరి అంతర్జాతీయ టీ20ని కూడా ఇంగ్లండ్‌పైనే 2017లో ఆడాడు.
Special day with special friends ! A day to remember 🥂☝🏼 thank you all for your love and wishes ! ❤️🙏 pic.twitter.com/wfzmSlgjm6
— yuvraj singh (@YUVSTRONG12) December 12, 2019
Special day with special friends ! A day to remember 🥂☝🏼 thank you all for your love and wishes ! ❤️🙏 pic.twitter.com/llwRp7YBVH
— yuvraj singh (@YUVSTRONG12) December 12, 2019
Comments
Please login to add a commentAdd a comment