శామ్సన్, కరణ్‌లకు చోటు
యువరాజ్‌కు మళ్లీ నిరాశే
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
ముంబై: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ కోసం భారత జట్టును ప్రకటించారు. కేరళ యువ ఆటగాడు సంజూ శామ్సన్, రైల్వేస్ లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నారు. మంగళవారం సమావేశమైన సెలక్షన్ కమిటీ 17 మందిని ఎంపిక చేసింది. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ముంబై పేసర్ ధావళ్ కులకర్ణీ, మోహిత్ శర్మ, రైనా, ఉమేశ్, రాయుడులకు మళ్లీ పిలుపు అందింది. ప్రస్తుతం టెస్టు జట్టులో ఉన్న పుజారా, గంభీర్, ఇషాంత్, పంకజ్, విజయ్, సాహా, ఈశ్వర్ పాండే, వరుణ్ ఆరోన్‌లను తప్పించారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న స్పిన్నర్ అమిత్ మిశ్రా పేరును పరిగణనలోకి తీసుకోలేదని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు చోటు కల్పించామన్నారు.
ఇటీవల జరిగిన నాలుగు దేశాల టోర్నీలో పాల్గొన్న భారత్-ఎ జట్టు తరఫున శామ్సన్ అత్యధిక పరుగులు (244) చేస్తే, కులకర్ణీ అత్యధిక వికెట్లు (14) తీశాడు. టెస్టుల్లో విఫలమవుతున్న ధావన్, రోహిత్‌లపై సెలక్టర్లు మరోసారి నమ్మకం పెట్టారు. ఈనెల 25, 27, 30, సెప్టెంబర్ 2, 5న వన్డేలు; 7న టి20 మ్యాచ్ జరుగనుంది.
జట్టు: ధోని (కెప్టెన్), కోహ్లి, ధావన్, రోహిత్, రహానే, రైనా, జడేజా, అశ్విన్, బిన్నీ, భువనేశ్వర్, షమీ, మోహిత్, రాయుడు, ఉమేశ్, ధావళ్, శామ్సన్, కరణ్.