kiran sharma
-
ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం
-
అందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలే నిదర్శనం
-
ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం
-
శ్రీ శారదా పీఠం ముందే చెప్పింది
సాక్షి, విజయవాడ: అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుందని శారదాపీఠం ఆనాడే చెప్పిందని, అందుకు తెలుగునాట ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులే నిదర్శనమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. భవిష్యత్తును ఊహించే ఏకైక పీఠం శ్రీ శారదాపీఠం ఆయన పేర్కొన్నారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి స్వచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్ శర్మ (కిరణ్ బాలస్వామి) సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించారు. ఆయనకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. మూడురోజులపాటు జరిగిన ఈ మహోత్సవం ముగింపు సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు. (చదవండి: ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం) శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాలస్వామి నియమితులైన ఈ రోజు ఎంతో విశేషమైన రోజు అని అన్నారు. బాలస్వామికి స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశామని, తన పేరు స్వరూపానందేంద్ర సరస్వతి అని, స్వరూపం అన్నా, స్వాత్మ అన్న ఒక్కటేనని, తామిరువురం అద్వైత స్వరూపులమని ఆయన పేర్కొన్నారు. శారదా పీఠం ఉత్తరాధికారిగా బాలస్వామిని నియమిస్తున్న విషయాన్ని నాలుగేళ్ళ కిందటే వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాను చెప్పానని, ఆయన ఎంతో సంతోషించారని తెలిపారు. కేసీఆర్ కూడా ఈ విషయం తెలుసుకొని.. రాజశ్యామల యాగం సందర్భంగా బాలస్వామిని ఘనంగా సత్కరించి తెలంగాణ నుంచి ఆంధ్రకు పంపారని తెలిపారు. అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుందని శారదాపీఠం గతంలోనే చెప్పిందని, అందుకు తెలుగునాట ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు నిదర్శనమని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తులని, వారిద్దరికి అత్యంత ఇష్టమైన వ్యక్తి స్వాత్మానందేంద్ర సరస్వతి అని పేర్కొన్నారు. రాజశ్యామల మాత సాక్షిగా 2024 నాటికి పూర్తిగా పీఠం బాధ్యతలను స్వాత్మానంద్రేంద్ర సరస్వతీకి అప్పగిస్తానని స్వరూపానందేంద్ర ప్రకటించారు. ఆ తరువాత తన జీవితాన్ని తపస్సుకు అంకితం చేస్తానన్నారు. కశ్మీర్ నుంచి లడఖ్ వరకు పాదయాత్ర చేసి.. అక్కడి మంచులోనూ తపస్సు చేసి వచ్చిన యోధుడు స్వాత్మానందేంద్ర సరస్వతి అని పేర్కొన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం ఈ లోకానికి స్వాత్మానందేంద్ర సరస్వతీ రూపంలో ఆధ్యాత్మిక శక్తిని అందించిదని అన్నారు. మహాభారతం రెండుసార్లు చదివిన వ్యక్తి కేసీఆర్ అని, యాదాద్రి ఆలయాన్ని, వేములవాడ ఆలయాన్ని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. తన హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని, ఆయన అంటే తనకు పరమప్రాణమని పేర్కొన్నారు. దేవాలయాల పరిరక్షణ కోసం వైఎస్ జగన్ పరితపించారని తెలిపారు. దేవతల ఆశీర్వాదంతో ఇద్దరు సీఎంలు 15 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించాలని, అప్పటివరకు శారదపీఠం తపస్సు చేస్తూనే ఉంటుందని అన్నారు. -
ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం
సాక్షి, విజయవాడ/తాడేపల్లి రూరల్: కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ ముగింపు మహోత్సవం సోమవారం కన్నులపండువగా జరిగింది. విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన కిరణ్‌కుమార్ శర్మ (కిరణ్ బాలస్వామి)కు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి స్వచ్చిదానంద ఆశ్రమంలో జరిగిన ఈ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ హాజరయ్యారు. (చదవండి: అధర్మం ఓడిపోతుందని ఆనాడే చెప్పాం) ఈ సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వామి కిరణ్‌కుమార్ శర్మలకు ఇరువురు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ ఫలపుష్పాలు సమర్పించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. వీరితోపాటు పలువురు ప్రముఖులు కూడా ఈ మహోత్సవానికి రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతి.. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి పుష్పాభిషేకం చేశారు. సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవంలో భాగంగా గత మూడురోజులుగా శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో కృష్ణ తీరంలో యాగ, హోమ, దాన, పూజాదికాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు, వేదపండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా కిరణ్‌కుమార్ శర్మ సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం జరిగింది. -
విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్ బాలస్వామి
సాక్షి, విజయవాడ/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్న కిరణ్ బాలస్వామికి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పగించనున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడ కృష్ణా తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కిరణ్ బాలస్వామి సన్యాసాశ్రమ దీక్ష కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారమే నగరానికి చేరుకున్న స్వరూపానందేంద్ర స్వామీజీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దీక్ష కార్యక్రమాలు సాగేదిలా.... శారదాపీఠం ఉత్తరాధికారి కిరణ్ బాలస్వామి దీక్షా క్రతువు మూడు రోజుల పాటు జరుగుతుంది. తొలిరోజు శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ చతుష్కృత్య ప్రాయశ్చిత్తం, దశవిధ స్నానాలు, కూష్మాండ, పురుషసూక్త, ప్రాజాపత్య, వైశ్వానర హోమాలు, షోడశమహాదానాలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ అష్ట శ్రాద్దాలు, శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్ధ మహాసభలు నిర్వహిస్తారు. సోమవారం మూడో రోజున ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైశ్వానర స్థాలీపాకం, విరజాహోమాలు, సావిత్రీ ప్రవిలాపనం, శిఖా, కటిసూత్ర, యజ్ఞోపవీత పరిత్యాగం, ప్రేషోచ్చారణం, కాషాయ, దండ, కమండలలు ధారణ, గురుసమీపగమనం, ప్రణవ, మహావాక్యోపదేశం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్ర సభ, అహితాగ్ని సభ, అనంతరం శ్రీప్రాచీన, నవీన గురువందనాలు, తర్వాత జగదుర్గు శ్రీ చరణులచే బాలస్వామి వారికి యోగపట్టా అనుగ్రహం జరుగుతాయి. చివరగా జగద్గురు శ్రీ చరణులు, బాలస్వామివార్ల అనుగ్రహ భాషణం ఉంటుందని, విద్వత్సన్మానం నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. దుర్గమ్మ సేవలో స్వరూపానందేంద్ర ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన విజయవాడ కనకదుర్గమ్మను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కమిషనర్ ఎం.పద్మ, ఆలయ ఈవో ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మహా గణపతి ప్రాంగణంలో స్వరూపానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు రిషికేష్, కాశీ, తమిళనాడులో శాఖోపశాఖలుగా విస్తరించిన విశాఖ శారదా పీఠం ఎన్నో ధర్మ పోరాటాలతోపాటు దేవాలయ భూములు, వ్యవస్థ పరిరక్షణకు కృషి చేసిందని చెప్పారు. ఆలయాల్లో ధూప దీపనైవేద్యాలు సక్రమంగా అమలు జరిగేలా చూడటంతోపాటు టీటీడీలో జరిగిన ఆగడాలపై పోరాటం చేసింది శారదా పీఠం మాత్రమేనన్నారు. రాజధానిలో పవిత్ర కృష్ణానది తీరాన పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. మూడు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాలలో చివరి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లతోపాటు గవర్నర్ నరసింహన్ పాల్గొంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని లోక కళ్యాణార్థం మూడు రోజులపాటు దీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. స్వామీజీతోపాటు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులున్నారు. పీఠాధిపతులు, మఠాధిపతుల రాక బాలస్వామి సన్యాసాశ్రమ దీక్షా కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు, సంతులు విచ్చేస్తున్నారు. శారదా పీఠం నిర్వాహకులు వారికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. -
శామ్సన్, కరణ్లకు చోటు
యువరాజ్‌కు మళ్లీ నిరాశే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక ముంబై: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ కోసం భారత జట్టును ప్రకటించారు. కేరళ యువ ఆటగాడు సంజూ శామ్సన్, రైల్వేస్ లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నారు. మంగళవారం సమావేశమైన సెలక్షన్ కమిటీ 17 మందిని ఎంపిక చేసింది. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ముంబై పేసర్ ధావళ్ కులకర్ణీ, మోహిత్ శర్మ, రైనా, ఉమేశ్, రాయుడులకు మళ్లీ పిలుపు అందింది. ప్రస్తుతం టెస్టు జట్టులో ఉన్న పుజారా, గంభీర్, ఇషాంత్, పంకజ్, విజయ్, సాహా, ఈశ్వర్ పాండే, వరుణ్ ఆరోన్లను తప్పించారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న స్పిన్నర్ అమిత్ మిశ్రా పేరును పరిగణనలోకి తీసుకోలేదని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు చోటు కల్పించామన్నారు. ఇటీవల జరిగిన నాలుగు దేశాల టోర్నీలో పాల్గొన్న భారత్-ఎ జట్టు తరఫున శామ్సన్ అత్యధిక పరుగులు (244) చేస్తే, కులకర్ణీ అత్యధిక వికెట్లు (14) తీశాడు. టెస్టుల్లో విఫలమవుతున్న ధావన్, రోహిత్‌లపై సెలక్టర్లు మరోసారి నమ్మకం పెట్టారు. ఈనెల 25, 27, 30, సెప్టెంబర్ 2, 5న వన్డేలు; 7న టి20 మ్యాచ్ జరుగనుంది. జట్టు: ధోని (కెప్టెన్), కోహ్లి, ధావన్, రోహిత్, రహానే, రైనా, జడేజా, అశ్విన్, బిన్నీ, భువనేశ్వర్, షమీ, మోహిత్, రాయుడు, ఉమేశ్, ధావళ్, శామ్సన్, కరణ్.