అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుందని శారదాపీఠం ఆనాడే చెప్పిందని, అందుకు తెలుగునాట ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులే నిదర్శనమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. భవిష్యత్తును ఊహించే ఏకైక పీఠం శ్రీ శారదాపీఠం ఆయన పేర్కొన్నారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి స్వచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్ శర్మ (కిరణ్ బాలస్వామి) సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించారు.