Sri Sharada Peetham
-
విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో లక్ష చండీ మహాయజ్ఞం
-
13 నుంచి శారదా పీఠాధిపతి చాతుర్మాస దీక్ష
పెందుర్తి: ఈనెల 13 నుంచి పవిత్ర చాతుర్మాస దీక్షను విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చేపట్టనున్నారు. రుషికేష్‌లోని పవిత్ర గంగానదీ తీరాన శ్రీశారదాపీఠం శాఖలో గురుపూర్ణిమ సందర్భంగా స్వామీజీలు ఈ దీక్షను ఆచరించనున్నారు. గురు పూర్ణిమ పర్వదినం రోజున వ్యాస పూజతో దీక్షకు అంకురార్పణ జరుగుతుంది. స్వామీజీకి ఇది 26వ చాతుర్మాస దీక్ష కాగా.. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి నాలుగోసారి దీక్ష చేపట్టనున్నారు. దీక్షా కాలంలో పరివ్రాజ్యలు(పర్యటనలు) చేయరు. మొదటి నెలలో కూరలు, రెండో నెలలో పెరుగు, మూడో నెలలో పాలు, నాలుగో నెలలో పప్పుదినుసులను స్వీకరించరు. ఈ సమయంలో సాధువులకు, సన్యాసులకు భండారా (అన్నదానం) నిర్వహించి దక్షిణలు సమర్పిస్తారు. గంగమ్మతల్లికి నిత్య పూజలు చేసిన తరువాత శ్రీశారదా పీఠం అధిష్టాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరులకు నిత్య పీఠార్చన చేపడతారు. వేద విద్యార్థులకు స్వామీజీ ధార్మిక అంశాలను బోధిస్తారు. దీక్షా కాలంలో స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రుషికేష్‌కు వెళ్తుంటారు. -
గిరిజనులతో పాతికేళ్ల అనుబంధం
సాక్షి, పాడేరు (ఏఎస్సార్ జిల్లా): వివిధ ప్రాంతాల్లోని గిరిజనులతో విశాఖలోని శ్రీశారదా పీఠానికి పాతికేళ్ల అనుబంధం ఉందని, గిరిజనులంటే తమ పీఠానికి ప్రాణమని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. పాడేరు ఏజెన్సీలో టీటీడీ సహకారంతో నిర్మించిన రామాలయాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ.. గుమ్మలక్ష్మీపురం, అరకు లోయ, పాడేరు ప్రాంతాల్లోని గిరిజనులకు తమ పీఠం ద్వారా సేవ చేస్తున్నామన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ, చలికాలంలో రగ్గులు, దుప్పట్లు, వంద గోవులను కూడా పంపిణీ చేశామన్నారు. ఆంజనేయ స్వామి గిరిజనుడేనని, ఆంజనేయుడి సహకారంతోనే శ్రీరాముడు లంకకు చేరి రావణాసురుడిని అంతమొందించారని, ఆ పోరాటంలోనూ గిరిజనులే ఉన్నారని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో నిర్మించే ఆలయాల నిర్వహణ, పూజా కార్యక్రమాల బాధ్యతను స్థానిక గిరిజనులకే శిక్షణ ఇచ్చేందుకు శారదా పీఠం సిద్ధంగా ఉందన్నారు. గిరిజనులకు సింహాచలం అప్పన్న దర్శనం చేయించడంతోపాటు చందనమాల వేయించి, భక్తిశ్రద్ధలతో దీక్ష పూర్తి చేయించి, రవాణా ఖర్చులు భరిస్తూ వారికి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటికే అనేక ప్రాంతాల గిరిజనులతో పాటు పీవీటీజీ తెగను కూడా తిరుమల యాత్రకు తీసుకెళ్లామన్నారు. తొలుత పాడేరు మోదకొండమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దబ్బాపుట్టు గ్రామంలో రామాలయాన్ని ప్రారంభించారు. గిరిజనులంతా స్వామీజీకి పూలమాలలు వేసి హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, నర్సింగరావు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు పాల్గొన్నారు. -
రాజశ్యామల తంత్ర మహిమాన్వితం శ్రీశారదా పీఠం
పెందుర్తి: జగన్మాత రాజశ్యామల అమ్మవారి ఉపాసన పూర్తిస్థాయిలో తెలిసిన ఏకైక పీఠం శ్రీశారదాపీఠం అని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. 14 ఏళ్ల పాటు హిమాలయాల్లో సంచరించిన సమయంలో తపస్సంపన్నుల సాన్నిహిత్యం, మహానుభావుల ఉపదేశంతో రాజశ్యామల అమ్మవారి తంత్రాన్ని తెలుసుకోగలిగానన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ.. రాజశ్యామల అమ్మవారి ఉపాసన బలంతో ఇక్కడ పీఠాన్ని నెలకొల్పామని తెలిపారు. కుల, మత బేధ రహిత అద్వైత వేదాంతాన్ని బోధించిన జగద్గురువు ఆదిశంకరాచార్యుని బోధనలను తమ పీఠం పుణికిపుచ్చుకుందన్నారు. వార్షికోత్సవాల్లో ప్రతి ఏటా శ్రౌత, శాస్త్ర సభలు నిర్వహించడం ఆనవాయితీ అని.. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది సభలు రద్దు చేశామని తెలిపారు. శ్రీశారదాపీఠంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎంతో అనుబంధం ఉన్నందున సీఎంను ప్రత్యేకంగా వార్షికోత్సవాలకు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. శాస్త్రోక్తంగా కార్యక్రమాలు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సారథ్యంలో పీఠం వార్షిక మహోత్సవాలకు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా అంకురార్పణ జరిగింది. స్వామీజీలు అమ్మవారికి ప్రత్యేక పూజలు, గోపూజ నిర్వహించారు. పండితులకు దీక్షా వస్త్రాలను అందించారు. లోకకల్యాణార్థం లక్ష్మిగణపతి హోమం, మేధాదక్షిణామూర్తి హోమం చేపట్టారు. శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరుల పీఠార్చన గావించారు. సర్వజనుల హితాన్ని కాంక్షిస్తూ చేపట్టిన చతుర్వేద పారాయణంలో వందలాది మంది పండితులు పాల్గొన్నారు. -
అన్నపూర్ణగా రాజశ్యామల అమ్మవారు
పెందుర్తి: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదా పీఠంలో నాలుగో రోజు ఆదివారం అన్నపూర్ణదేవిగా శ్రీశారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం చేశారు. లోకకల్యాణార్థం పీఠంలో చేపట్టిన శత చండీయాగం, శ్రీమత్ భాగవత పారాయణం, వేదపారాయణం, నవావరణ అర్చన శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం అమ్మవారికి స్వామీజీల చేతుల మీదుగా ఏకాదశ హారతులు ఇచ్చారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం (నేడు) లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారని పీఠం ప్రతినిధులు వెల్లడించారు. -
శారదాపీఠం వార్షికోత్సవంలో సీఎం జగన్
-
శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి. విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎన్ జగన్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. గంటపాటు కొనసాగిన ఈ సమావేశం ముగిసింది. సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ‘సీఎం జగన్మోహన్రెడ్డి మాటపై మాకు నమ్మకం ఉంది. ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అందరూ కలిసికట్టుగా పోరాడాలి’ అని వారు పేర్కొన్నారు. శారదా పీఠ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్వాగతం పలికారు. శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తొలి రోజు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. నేటి నుంచి శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమవ్వగా.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. బుధవారం ఉదయం 7:30 గంటలకు స్వరూపానందేంద్ర సరస్వతి ఉత్సవాలకు అంకురార్పణ చేసి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. దేశ రక్షణ, లోక కల్యాణార్థం రాజశ్యామల యాగం వేదోక్తంగా ప్రారంభమైంది. శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ అక్కడ స్వామీజీలతో కలిసి గోపూజ, శమీవృక్షం ప్రదక్షిణలో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. చదవండి: వైఎస్ జగన్‌కు ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డు -
విశాఖ : శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
శారద పీఠం వార్షికోత్సవంలో సీఎం జగన్
-
శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సావాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. సోమవారం శారద పీఠం చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు. శారదా పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజల చేశారు. పీఠాధిపతులతో కలిసి జమ్మిచెట్టు ప్రదక్షిణ చేసిన సీఎం వైఎస్ జగన్.. గోమాతకు నైవేద్యం సమర్పించారు. పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆగమ యాగశాలలో ఐదు రోజులుగా టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాస చతుర్వేద హవనం పూర్ణాహుతిలో సీఎం వైఎస్ జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం లోక కల్యాణార్థం విశాఖ శారదా పీఠం చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతికి సీఎం హారజయ్యారు. అలాగే పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానంలో ముద్రించిన తత్త్వమసి గ్రంథాన్ని సీఎం స్వీకరించారు. శ్రౌత మహాసభలో ఉత్తమ పండితునికి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా స్వర్ణకంకణధారణ చేశారు. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్‌రాజు, టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రశాంతిరెడ్డి, నాదెళ్ల సుబ్బారావు, శేఖర్‌రెడ్డిలు ఉన్నారు. విశాఖలో సీఎం జగన్‌కు ఘనస్వాగతం.. అంతకుముందు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం లభించింది. వైఎస్సార్సీపీ నేతలు, మహిళలు, అభిమానులు సీఎం వైఎస్ జగన్‌కు ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సీఎం వైఎస్ జగన్.. శారదా పీఠం చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు విశాఖలో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
రేపు విశాఖకు సీఎం వైఎస్ జగన్..
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విశాఖపట్నం వెళ్లనున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవానికి సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్ జగన్ 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 10.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10.40 గంటలకు చినముషిడివాడలోని శారదా పీఠానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం శారదాపీఠం నుంచి 12.50కి సీఎం వైఎస్ జగన్ విశాఖ విమానాశ్రయానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకోనున్నారు. -
అందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలే నిదర్శనం
-
శ్రీ శారదా పీఠం ముందే చెప్పింది
సాక్షి, విజయవాడ: అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుందని శారదాపీఠం ఆనాడే చెప్పిందని, అందుకు తెలుగునాట ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులే నిదర్శనమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. భవిష్యత్తును ఊహించే ఏకైక పీఠం శ్రీ శారదాపీఠం ఆయన పేర్కొన్నారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి స్వచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్ శర్మ (కిరణ్ బాలస్వామి) సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించారు. ఆయనకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. మూడురోజులపాటు జరిగిన ఈ మహోత్సవం ముగింపు సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు. (చదవండి: ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం) శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాలస్వామి నియమితులైన ఈ రోజు ఎంతో విశేషమైన రోజు అని అన్నారు. బాలస్వామికి స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశామని, తన పేరు స్వరూపానందేంద్ర సరస్వతి అని, స్వరూపం అన్నా, స్వాత్మ అన్న ఒక్కటేనని, తామిరువురం అద్వైత స్వరూపులమని ఆయన పేర్కొన్నారు. శారదా పీఠం ఉత్తరాధికారిగా బాలస్వామిని నియమిస్తున్న విషయాన్ని నాలుగేళ్ళ కిందటే వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాను చెప్పానని, ఆయన ఎంతో సంతోషించారని తెలిపారు. కేసీఆర్ కూడా ఈ విషయం తెలుసుకొని.. రాజశ్యామల యాగం సందర్భంగా బాలస్వామిని ఘనంగా సత్కరించి తెలంగాణ నుంచి ఆంధ్రకు పంపారని తెలిపారు. అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుందని శారదాపీఠం గతంలోనే చెప్పిందని, అందుకు తెలుగునాట ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు నిదర్శనమని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తులని, వారిద్దరికి అత్యంత ఇష్టమైన వ్యక్తి స్వాత్మానందేంద్ర సరస్వతి అని పేర్కొన్నారు. రాజశ్యామల మాత సాక్షిగా 2024 నాటికి పూర్తిగా పీఠం బాధ్యతలను స్వాత్మానంద్రేంద్ర సరస్వతీకి అప్పగిస్తానని స్వరూపానందేంద్ర ప్రకటించారు. ఆ తరువాత తన జీవితాన్ని తపస్సుకు అంకితం చేస్తానన్నారు. కశ్మీర్ నుంచి లడఖ్ వరకు పాదయాత్ర చేసి.. అక్కడి మంచులోనూ తపస్సు చేసి వచ్చిన యోధుడు స్వాత్మానందేంద్ర సరస్వతి అని పేర్కొన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం ఈ లోకానికి స్వాత్మానందేంద్ర సరస్వతీ రూపంలో ఆధ్యాత్మిక శక్తిని అందించిదని అన్నారు. మహాభారతం రెండుసార్లు చదివిన వ్యక్తి కేసీఆర్ అని, యాదాద్రి ఆలయాన్ని, వేములవాడ ఆలయాన్ని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. తన హృదయంలో ఒక ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని, ఆయన అంటే తనకు పరమప్రాణమని పేర్కొన్నారు. దేవాలయాల పరిరక్షణ కోసం వైఎస్ జగన్ పరితపించారని తెలిపారు. దేవతల ఆశీర్వాదంతో ఇద్దరు సీఎంలు 15 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించాలని, అప్పటివరకు శారదపీఠం తపస్సు చేస్తూనే ఉంటుందని అన్నారు. -
శారదాపీఠంలో వైభవంగా మహాకుంభాభిషేకం
పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠంలో అష్టబంధన మహాకుంభాభిషేకం గురువారం వైభవంగా జరిగింది. దేశంలోని పవిత్ర నదులైన గంగా, యయున, సరస్వతి, వృద్ధ గంగగా పేరుగాంచిన గోదావరి జలాలతో కార్గిల్, లడాక్ ప్రాంతాల్లోని ఇండస్, జాన్సర్గ్ నదుల నుంచి సేకరించిన జలాలతో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా అభిషేకాలు జరిపారు. పీఠంలో రాజశ్యామల స్వరూప శారదామాత ఆలయాన్ని స్వామీజీ చేతుల మీదుగా పునఃప్రారంభించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. తొలిపూజ స్వామీజీ ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేస్తూ దేశంలో ఎక్కడా లేని రాజశ్యామల స్వరూప శారదామాత ఆలయాన్ని శారదాపీఠంలో నిర్మించడం అమ్మవారి కృపగా భావిస్తున్నామన్నారు. తరతరాలుగా భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్న తలంపుతో ఉపానాది స్థూపి పర్యాంతం(పునాది నుంచి శిఖరం వరకు శిల) ఆలయం నిర్మించామన్నారు. దేశంలోని శారదాపీఠం శాఖలన్నింటికీ ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ(బాలస్వామి)ని జూన్ 17న అమరావతిలో జరిగే కార్యక్రమంలో నియమిస్తామని స్వామీజీ ప్రకటించారు. మహాపూర్ణాహుతి ఘట్టంతో వార్షిక వేడుకలు ముగిశాయి. స్వామీజీ చేతుల మీదుగా పండిత సత్కారం, పీఠం ఆస్థాన శిల్పి గణపతి కుమారుడు జయేంద్ర స్థపతికి స్వర్ణకంకణం, ధర్మాధికారి జి.కామేశ్వరశర్మకు స్వర్ణ అంగుళీకం, ఆభరణ శిల్పి గణేష్‌కు అంగుళీకం ప్రదానం చేశారు. ప్రధాని మోదీ దూతగా ఎంపీ జీవీఎల్ నర్శింహరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తరపున ఎమ్మెల్యే, మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి దంపతులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రతినిధిగా జీవీడీ కృష్ణమోహన్ వేడుకలకు హాజరయ్యారు. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, విరంచి ఫ్యాషన్స్ అధినేత మర్రెడ్డి రామకృష్ణారెడ్డి, వేలాదిగా భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. -
రేపు శారదాపీఠానికి సీఎం కేసీఆర్ రాక
విశాఖపట్నం, పెందుర్తి: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠాన్ని సందర్శించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరనున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శారదాపీఠానికి చేరుకుంటారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ ఆశీర్వచనం తీసుకుంటారు. పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేస్తారు. దాదాపు రెండు గంటలసేపు పీఠంలోనే కేసీఆర్ గడుపుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు పయనమవుతారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి శారదాపీఠానికి రానుండడంతో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవైపు అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా... నిఘా వర్గాలు విస్తృత భద్రతపై దృష్టి సారించాయి. శనివారం ఉదయం నుంచి పెందుర్తి ప్రాంతం పూర్తిగా భద్రతా వర్గాల ఆధీనంలోకి వెళ్లిపోనుంది. మరోవైపు సీఎం కేసీఆర్‌కు స్వాగత ఏర్పాట్లపై శారదాపీఠం వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలకు ముందు స్వామీజీ ఆధ్వర్యంలో కేసీఆర్ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాదించించిన సంగతి తెలిసిందే. -
'తిరుపతి కొండలు తవ్వండి.. భక్తులు ఊరుకుంటారా ?'
విశాఖపట్నం : 'బాక్సైట్' వ్యతిరేక ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని విశాఖపట్నంలోని శ్రీ శారదాపీఠం స్వామిజీ శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు, పెద్దబయలు మండలాల్లో స్వరూపానందేంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులకు దుప్పట్లు, చీరలు ఆయన అందజేశారు. అనంతరం స్వరూపానందేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని గిరిజన సంపదను కొల్లగొట్టేందుకు యత్నం జరుగుతోందని, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని ఆయన ఆరోపించారు. పురాణకాలంలో రాముడు, కృష్ణుడు నడియాడిన కొండలివని తెలిపారు. ఆంజనేయుడూ ఓ గిరిజనుడే అని స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి గుర్తు చేశారు. చేతనైతే తిరుపతి, సింహాచలం కొండలను తవ్వండి అని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆ కొండలు తవ్వితే భక్తులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ప్రతి ఆదివాసీ బాక్సైట్ తవ్వకాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. విదేశీ మూకలను తరిమికొట్టండని గిరిజనులకు ఆయన సూచించారు. విశాఖపట్నం జిల్లా అరకులో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ టీడీపీ ప్రభుత్వం జీవో 97ను జారీ చేసింది. ఈ జీవోపై ప్రజలు, గిరిజనలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సదరు జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.