
హాజల్ కీచ్‌తో యువీ పెళ్లి?
ఫిబ్రవరిలో జరిగే అవకాశం
ముంబై: బాలీవుడ్ నటి, బ్రిటిష్ మోడల్ హాజల్ కీచ్‌తో వచ్చే ఫిబ్రవరిలో యువరాజ్ సింగ్ వివాహం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీపావళి తర్వాత తన పెళ్లి వార్త గురించి యువరాజ్ చెబుతాడంటూ ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్టార్ క్రికెటర్ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం ఫిబ్రవరిలో పెళ్లి జరిగే అవకాశం ఉంది.
బాడీగార్డ్, బిల్లా సినిమాల్లో కీచ్ నటించింది. ఈ బ్రిటిష్ యువతితో యువీ డేటింగ్ చేస్తున్నాడంటూ నాలుగు నెలల క్రితం వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరూ గతంలో లండన్‌లో కలిసి తిరుగుతూ మీడియా కంట పడ్డారు.