యువరాజ్ స్థానంలో మనీష్? | Yuvraj Singh ruled out of tournament after twisting ankle against Australia? | Sakshi
Sakshi News home page

యువరాజ్ స్థానంలో మనీష్?

Published Mon, Mar 28 2016 9:26 PM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

యువరాజ్ స్థానంలో మనీష్? - Sakshi

యువరాజ్ స్థానంలో మనీష్?

ముంబై:వరల్డ్ టీ 20లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో తొడ కండరాల గాయంతో సతమతమైన టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సెమీ ఫైనల్కు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆసీస్ మ్యాచ్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు ఛేజింగ్ దిగిన అనంతరం ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన యువరాజ్ తొడకండరాలు పట్టేశాయి. దీంతో యువీ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. 

 

ఈ నేపథ్యంలో గురువారం వెస్టిండీస్ తో జరిగే సెమీ ఫైనల్లో మ్యాచ్ లో యువీ పాల్గొనడం అనుమానంగా మారింది. ఒకవేళ ఆ మ్యాచ్ సమయానికి యువరాజ్ ఫిట్ కాని పక్షంలో మనీష్ పాండేను తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది. విండీస్ తో మ్యాచ్ కు యువీ దూరమైతే మనీష్ ను తీసుకోవాలని టీమిండియా సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ లో చివరి మ్యాచ్ ఆడిన మనీష్ సెంచరీతో ఆకట్టుకుని భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement