పులివెందులలో నాటుబాంబుల కలకలం | 1 injured, crude-bombs attack in pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందులలో నాటుబాంబుల కలకలం

Published Mon, Nov 14 2016 12:32 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

1 injured, crude-bombs attack in pulivendula

పులివెందుల: వైఎస్సార్‌జిల్లా పులివెందులలో నాటుబాంబుల కలకలం రేగింది. స్థానిక నామాలగుండు శివాలయంలో పూజలు నిర్వహించడానికి వెళ్లిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థి వర్గీయులు బాంబులతో దాడి చేశారు. ఈ సంఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. పులివెందులకు చెందిన మొట శంకరప్ప సోమవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నామాలగుండు ఆలయంలో పూజలు నిర్వహించడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న ప్రత్యర్థి వర్గీయులు ఆలయ సమీపంలో అతనిపై నాటుబాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో శంకరప్పకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. శంకరప్పపై దాడి చేసిన వారు అనంతపురం జిల్లా తలుపుల మండలం ఎపిలిపల్లికి చెందిన సంజీవరాయుడు వర్గీయులని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement