బాలికపై ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ లైంగికదాడి
బాలికపై ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ లైంగికదాడి
Published Wed, Jul 12 2017 8:41 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
♦ కర్ణాటకలోని రాణిబెన్నూరులో ఘోరం
బెంగళూరు: కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. బిడ్డలా ఆదరించాల్సిన బాలికపై కామాంధులు కాటేశారు. ప్రేమించిన యువకుని కోసం ఒంటరిగా వచ్చిన బాలిక (15)పై కేఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్ బస్సులోనే సామూహిక అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన బాలిక- ఉడుపిలో ఓ కాలేజీ కుర్రాడు ప్రేమించుకున్నారు. ఇద్దరికి విభేదాలు రావడంతో ఆ యువకుడు హావేరి జిల్లా రాణిబెన్నూరుకు వచ్చేశాడు. బాలిక కూడా ఈ నెల 5వ తేదీన మణిపాల్ నుంచి కేఎస్‌ఆర్టీసి బస్సులో ఒంటరిగా రాణిబెన్నూరుకు వచ్చింది. ప్రియుని కోసం వీధి వీధి గాలించి కనిపించకపోవడంతో సొంతూరు వెళ్లడానికి 6వ తేదీ రాత్రి రాణిబెన్నూరు బస్టాండ్‌కు చేరుకుంది.
బాలిక పరిస్థితిని గమనించిన కేఎస్‌ఆర్టీసి బస్సు డ్రైవర్ వీరయ్య హీరేమఠ, కండక్టర్ యువరాజ్ కట్టెకార్‌తో పాటు మరో డ్రైవర్ రాఘవేంద్ర బడిగేరెలు తాము సహాయం చేస్తామంటూ నమ్మబలికారు. బస్సులోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించడంతో మౌనం వహించిన బాలికను మరుసటి రోజు ప్రయాణికులతో పాటు అదే బస్సులో మణిపాల్‌లో దించేసారు. ఇంటికి చేరుకున్న తరువాత ఈ ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఉడుపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉడుపి మహిళా పోలీసులు మంగళవారం ముగ్గరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement