బ్యాంక్ ఉద్యోగం పేరుతో యువతిపై దారుణం | 25-year-old woman gangraped, two arrested | Sakshi
Sakshi News home page

బ్యాంక్ ఉద్యోగం పేరుతో యువతిపై దారుణం

Published Mon, Aug 22 2016 6:45 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

25-year-old woman gangraped, two arrested

అహ్మద్ నగర్: బ్యాంక్ ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువతి (25)కి మాయమాటలు చెప్పి ముగ్గురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు హరిభా వర్పె (32), విలాస్ రఘునాత్ షిండె (30)లను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో నిందితుడు పరారీలో ఉన్నాడు. వర్పె కో ఆపరేటివ్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన బాధితురాలికి బ్యాంక్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ముగ్గురూ రప్పించారు. జిల్లా కేంద్రానికి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మడి హిల్స్ కు ఆమెను తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ దృశ్యాలను వీడియో తీసి, ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. ఆమె నుంచి మొబైల్ ఫోన్, నగదు లాక్కొన్నారు. వీరి బారి నుంచి బయటపడిన బాధితురాలు రాహురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement