- జూన్ 26లోపు ద రఖాస్తు చేసుకోవాలన్న ప్రభుత్వం
- డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడానికే నిర్ణయమంటున్న అధికారులు
సాక్షి, ముంబై: పాఠశాల విద్యార్థులకు ఆధార్ కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జూన్ 26 లోపు దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థుల అడ్మిషన్ నంబర్‌తో దీన్ని అనుసంధానిస్తామని తెలిపింది. విద్యార్థులు మధ్యలోనే పాఠశాల విద్యను వదలకుండా (డ్రాప్ అవుట్స్) పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 14 ఏళ్లలోపు కోటి మంది చిన్నారులు ఆధార్ కార్డు వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందవచ్చని సంబంధిత అధికారి పేర్కొన్నారు.
ప్రాథమిక విద్య వరకైనా పాఠశాలకు హాజరై ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కలెక్టర్లు వారి ప్రాంతాల్లోని విద్యార్థుల ఆధార్ కార్డుల పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయమై విద్యార్థుల్లో అవగాహన కల్పించి త్వరితగతిన నమోదు చేసుకునేలా చూడాలని కోరింది. అయితే విద్యా సంవత్సర ప్రారంభంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ఇది అదనపు భారమని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నిస్తుందని ుహారాష్ర్ట స్టేట్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్స్ ప్రిన్సిపల్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రశాంత్ రెడ్‌జీ పేర్కొన్నారు. సాక్షి, ముంబై: పాఠశాల విద్యార్థులకు ఆధార్ కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జూన్ 26 లోపు దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థుల అడ్మిషన్ నంబర్‌తో దీన్ని అనుసంధానిస్తామని తెలిపింది. విద్యార్థులు మధ్యలోనే పాఠశాల విద్యను వదలకుండా (డ్రాప్ అవుట్స్) పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని 14 ఏళ్లలోపు కోటి మంది చిన్నారులు ఆధార్ కార్డు వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందవచ్చని సంబంధిత అధికారి పేర్కొన్నారు. ప్రాథమిక విద్య వరకైనా పాఠశాలకు హాజరై ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కలెక్టర్లు వారి ప్రాంతాల్లోని విద్యార్థుల ఆధార్ కార్డుల పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయమై విద్యార్థుల్లో అవగాహన కల్పించి త్వరితగతిన నమోదు చేసుకునేలా చూడాలని కోరింది.
అయితే విద్యా సంవత్సర ప్రారంభంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ఇది అదనపు భారమని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నిస్తుందని ుహారాష్ర్ట స్టేట్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్స్ ప్రిన్సిపల్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రశాంత్ రెడ్‌జీ పేర్కొన్నారు.
పాఠశాల విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి
Published Wed, Apr 22 2015 11:01 PM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement
Advertisement