తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బావి
Published Wed, Nov 9 2016 4:11 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారం -మజీద్‌పూర్ గ్రామాల సరిహద్దుల్లో జరిగిన తవ్వకాల్లో నిజాంకాలం నాటి బావి బయటపడింది. అయితే, గుప్తనిధి కూడా దొరికి ఉంటుందన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. వివరాలివీ.. బాటసింగారం -మజీద్‌పూర్ గ్రామాల సరిహద్దుల్లో సత్రామహల్ (విడిది గృహం)గా పిలిచే స్థలం ఉంది. సత్రామహల్ నిజాం కాలంలో బాటసారులకు విడిది గృహంగా ఉపయోగించుకునే వారని తెలుస్తోంది. అయితే, అనాజ్‌పూర్ రెవెన్యూ పరిధిలో ఈ భూమి ప్రస్తుతం బాటసింగారం గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన పట్టా.
మూడెకరాల ఈ స్థలంలో సుమారు వెయ్యి గజాల స్థలం ఎత్తుగా ఉంటుంది. దాని చుట్టూ చింతచెట్లు ఉంటాయి. కాగా, ఈ స్థలంలో గుప్త నిధులు ఉంటాయన్న అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులు వేట ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థలంలో మూడో కంటికి తెలియకుండా మంగళవారం రాత్రి యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో స్థలం మధ్యలో ఓ బావి బయట పడింది. అయితే తవ్వకాల్లో నిధి బయట పడిందా అన్న విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Advertisement