అయిదంతస్తులు.. వంద అడుగుల లోతు.. కాకతీయుల కాలం నాటి కళాత్మక నిర్మాణమిది. శిథిలమైపోతున్న ఒక పురాతన బావి నేపథ్యమిది. పాలకుల ఆదరణకు నోచక..శిథిలమైపోతున్న ఈ బావి కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్ర శివారులో ఉంది. సుమారు 18వ శతాబ్దంలో నిర్మితమైన ఈ బావి అడుగు నుంచిపైభాగంవరకునాలుగు వైపులా ఒకే రకమైన మెట్లు ఉన్నాయి. ఉపరితలం నుంచి 20 అడుగుల వరకు ఒక్కొక్క అంతస్తు చొప్పున అయిదు అంతస్తుల మెట్లు ఉన్నాయి.
మెట్ల బావి చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచాయి. పునరుద్ధరణ కోసం పురావస్తు శాఖ ముందుకొచ్ఛినా.. నిధుల కొరత వల్ల ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ మెట్ల బావి తరహాలోనే.. లింగంపేటలోని పురాతన మెట్ల బావిని బాగు చేయాలని.. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment