ఏఈఎస్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం | Andhra Education Society prasadnagar republic day celebrationS | Sakshi
Sakshi News home page

ఏఈఎస్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

Published Sun, Jan 25 2015 10:55 PM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM

Andhra Education Society prasadnagar republic day celebrationS

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్ర  విద్యా సంఘం ప్రసాద్‌నగర్ పాఠశాల లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామానుజన్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. తుషార్‌కాంత్‌మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఎగురవేసి ఎన్‌సీసీ సౌట్స్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు  పాల్గొన్నారు.
 
 నేడు ఏపీ భవన్‌లో... ‘వందేమాతరం- భారతావనికి వందనం’
 ‘టీం ఏపీ భవన్’ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ భవన్‌లో సోమవారం సాయంత్రం నాలుగు నుంచి 7 గంటల వరకు డా.అంబేద్కర్ ఆడిటోరియంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చిన్నారుల్లో దేశభక్తిని, జాతీయతను పెంపొందించేందుకు ‘వందేమాతరం- భారతావనికి వంద నం’ పేరిట వినూత్న కార్యక్రమాలు రూపొందించారు. నృత్యం, సంగీతం, నాటకం, ఆంగికం సహా అన్ని అంశాలు ‘వందేమాతరం’ జాతీయ స్ఫూర్తిపైనే ప్రదర్శనలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా విద్యాసంఘం చిన్నారులు, శ్రీ వేంకటేశ్వరకళాశాల విద్యార్థులతోపాటు శ్రీకాకుళం, విజయవాడ, హైదరాబాద్ నుంచి వివిధ సాంస్కతిక సంఘాల కళాకారులు పాల్గొననున్నారు. వీటితోపాటు ఢిల్లీ తెలుగు అకాడమీ, తెలుగు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆదిలీలా ఫౌండేషన్, ఆంధ్రా సంస్కృతీ కేంద్ర, తెలుగు సాహితీ సంస్థల తరఫునపలు బృందాలు కళా ప్రదర్శన ఇవ్వనున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement