
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలను ఎంపిక చేసింది. ఈమేరకు రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. రాష్ట్రపతిభవన్ వద్దనున్న రాయ్‌సీనా హిల్స్ నుంచి మొదలై రాజ్‌పథ్, ఇండియాగేట్ మీదుగా ఎర్రకోట వరకు జరిగే పరేడ్‌లో ఈ శకటాలు పాల్గొంటాయి. తెలంగాణ శకటాన్ని ఆ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, మేడారం సమ్మక్క–సారక్క జాతర, వేయిస్తంభాల గుడి ఇతివృత్తంతో రూపొందిస్తారు. ఏపీ శకటాన్ని కూచిపూడి నృత్యం, కొండపల్లి అంబారీ, దశావతారాల»ొమ్మలు, కలంకారీ హస్తకళలతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల వైభవం ప్రతిబింబించేలా రూపొందిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ శకటాలను ఎంపిక చేసింది.