ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రాథ మిక పాఠశాల స్థాయి నుండి బోధనా మాధ్య మంగా ఆంగ్లాన్ని ప్రవేశ పెట్టాలని తీసుకున్న నిర్ణయం సరైన దిశలో ఒక సాహసోపేతమైన ముందడుగు. ఆంధ్రప్ర దేశ్ ఇప్పటికే పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టి దిగ్విజయంగా ముందుకు వెళుతోంది. ఇంగ్లీషు మీడియం విద్య తన ముఖ్య మైన ఎజెండాల్లో ఒకటిగా చేసుకొంది. ఈ ఏడాది ఢిల్లీలోని రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ తరఫున పాల్గొన్న శకటం ఇంగ్లీషు మీడియం చదువు ప్రాముఖ్యాన్ని ఎలుగెత్తి చాటింది.
దీన్నిబట్టి ఏపీ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం నుంచే పాఠశాల, కళాశాల స్థాయుల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టడా నికి కసరత్తు జరుగుతోంది. ఇంగ్లీషు మాధ్యమం విషయంలో కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసినా ఇప్పుడు వారూ నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. మొత్తం మీద విద్యావేత్తలు, విద్యా నిర్వాహ కులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి ఆంగ్ల మాధ్యమ విద్యకు ఎంతో మద్దతు లభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించి నప్పుడు మొదట్లో కొన్ని కార్పొరేట్ పాఠశాలలు, ఇతర స్వార్థ ప్రయోజనాలకుచెందిన కార్టెల్‌లు వ్యతిరేకించినప్పటికీ, తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యా కార్యకర్తలు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం బలమైన రాజకీయసంకల్పంతో ముందుకు సాగింది. అనేక దళిత సంఘాలు, ఎన్‌జీఓ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ర్యాలీలు నిర్వహించి బోధనా మాధ్యమంలో ప్రతిపాదిత మార్పుకు సంఘీభావం తెలిపాయి. ఆంగ్ల విద్య సామాజిక మార్పుకు నాంది పలుకు తుందనీ, సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు విముక్తి కల్పించే సాధనంగా ఉపయోగ పడుతుందనీ వారు భావించారు.
ఇంగ్లీషు చదువు వల్ల మాతృభాషకు నష్టం వాటిల్లుతుందని కొందరు అంటున్నారు. కానీ, భయపడాల్సిన పనిలేదు. ప్రాథమిక స్థాయి నుండే ఇంగ్లీషును ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తే, పిల్ల లకు ఆ భాషలో కూడా మెరుగైన వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందే అవకాశం ఉంది. సాఫ్ట్ వేర్, ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు నడిచే యుగం ఇది. ఇంగ్లీషు పరిజ్ఞానం ఈ రంగాల్లో చాలా అవసరం. ఇవ్వాళ మన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్న పిల్లలకు మెరుగైన అవకాశాలు లభించడం ఖాయం. ఫలితంగా వారి కుటుంబాల జీవన ప్రమాణాలు పెరుగుతుంది. ఇది అంతిమంగా రాష్ట్ర, దేశ అభివృద్ధికి దారితీస్తుంది.
ఇంగ్లీషు ప్రాధాన్యతను పెరుగుతున్న సామాజిక–ఆర్థిక అవసరాల కోణంలో చూడాలి. సృజనాత్మక రచన, సాహిత్య ఎదుగుదల మాతృభాష ద్వారానే సాధ్యమవుతుందనేది నిజం. కానీ ఇంగ్లీషు... దేశం లోపలా, బయటా అన్ని చోట్లా ఉనికిలోకి వచ్చింది. లింక్ లాంగ్వేజ్‌గా ఉంది. ఈ భాష లేకుండా ఈ రోజు ‘ప్రపంచ పౌరుడి’ని ఊహించలేము. ప్రాథమిక పాఠ శాలల నుండే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే సమాజంలో సమూలమైన మార్పు రావడం ఖాయం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ పాఠ శాలల్లో అధిక ఫీజులు కట్టి పిల్లలను చదివిస్తూ సతమతమవుతున్న మధ్యతరగతి తల్లిదండ్రులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న తెలుగు మాధ్యమాన్ని ఇంగ్లీషులోకి మార్చడం అనేక సవాళ్లతో కూడుకున్న పని. మొదటి అతి ముఖ్యమైనది ఉపాధ్యాయు లకు కొత్తగా శిక్షణ ఇవ్వడం. ముఖ్యంగా మారు మూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఇంగ్లీషు కమ్యూనికేషన్ ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ప్రతి ఒక్కరికీ తెలుసు.అందువల్ల, ఉపాధ్యాయులు ‘ఇంగ్లిష్‌అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ’ లేదా అటువంటి ఇతర సంస్థల ద్వారా, ‘ఉపాధ్యాయుల ఇండక్షన్ ప్రోగ్రామ్‌ల’ ద్వారా శిక్షణ ఇవ్వాలి. ఇంగ్లీషులో సబ్జె క్టుల బోధనకు ఉపయోగించే రీడింగ్/ టీచింగ్ మెటీరియల్స్ తయారీలో ఉపా ధ్యాయుల పాత్ర, విధి ఉంటుంది.
మాతృభాష ఆంగ్లం కాని పిల్లలకు బోధించడంలో అత్యంత సమగ్రమైన పద్ధతి, విధానాలు అత్యంత నైపుణ్యం కలిగి ప్రణాళికాబద్ధంగా అమలు చేయబడేవి. దీనికి తోడు ప్రస్తుతంఉన్న పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కూడా పెంచాలి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పాటూ ఎన్‌ఆర్‌ఐల ఇష్టపూర్వక సహ కారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడ తాయని ఆశిద్దాం.
- వ్యాసకర్త హైదరాబాద్ విశ్వవిద్యాలయం విశ్రాంత హిస్టరీ ప్రొఫెసర్
- కె.ఎస్.ఎస్. శేషన్
Comments
Please login to add a commentAdd a comment