
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 71వ గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వ కళారూపాలు, ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ...ఆకర్షణీయంగా రూపొందించిన ప్రగతిరథం రాజ్‌పథ్‌లో కనువిందు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం, బ్రహ్మోత్సవాలు, కూచిపూడి నృత్యాలు, ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలు, సహజరంగుల కలంకారీ అద్దకాలతో కూడిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుంది. ('అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే అన్ని వర్గాలకు న్యాయం')
అలాగే తెలంగాణ శకటం అందరినీ ఆకర్షించింది. రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, వాస్తు కళలు, పండుగలను చాటేలా ఈ శకటం రూపుదిద్దుకుంది. ముందు భాగంలో రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు, మధ్య భాగంలో సమ్మక్క, సారక్కల గద్దెలను ప్రతిబింబించేలా అమ్మవారి భారీ రూపం కొలువుతీరాయి. (ఘనంగా గణతంత్రం.. ప్రధాని మోదీ నివాళి)
Comments
Please login to add a commentAdd a comment