నోట్ల రద్దుపై కౌంటర్‌ దాఖలు చేయండి: హైకోర్టు | AP, Telangana High Court Notice to RBI, Centre | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుపై కౌంటర్‌ దాఖలు చేయండి: హైకోర్టు

Published Tue, Nov 29 2016 4:55 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

నోట్ల రద్దుపై కౌంటర్‌ దాఖలు చేయండి: హైకోర్టు - Sakshi

నోట్ల రద్దుపై కౌంటర్‌ దాఖలు చేయండి: హైకోర్టు

హైదరాబాద్‌: పాత పెద్ద నోట్ల రద్దుపై కౌంటర్‌ దాఖలు చేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్‌ ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలి​చ్చింది.

అయితే పాత పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని మధురై, కర్ణాటక కోర్టులు సమర్థించారని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు. ఫ్యాక్స్ ద్వారా కాకుండా నోటిఫికేష్‌ ద్వారా కూడా నోట్లను రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉందని వాదించారు. నోట్ల రద్దుపై స్టే ఇచ్చే అవకాశం ఉంది కానీ ఇవ్వలేకపోతున్నామని హైకోర్టు పేర్కొంది. నోట్ల కష్టాలతో ప్రజలతో పాటు తాము కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడించింది. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది.

రూ.1,000, రూ.500 నోట్ల రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8న జారీ చేసిన నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైదరా బాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వర రావు, న్యాయవాది కె.శ్రీనివాస్‌లు వేర్వేరుగా పిటి షన్లు దాఖలు చేశారు. కేంద్రం నగదు ఉపసంహరణను రూ.10 వేలకు, వారానికి గరిష్టంగా రూ.20 వేలకు పరిమితం చేయడంపై మాజీమంత్రి మైసూరారెడ్డి హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement