cash trouble
-
‘నోట్ల రద్దుతో ఎలాంటి ఫలితం లేదు’
-
‘నోట్ల రద్దుతో ఎలాంటి ఫలితం లేదు’
తిరుమల: ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ప్రధాని మోదీ పోగొట్టుకున్నారని వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం ఆమె తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నల్లధనాన్ని వెలికి తీయడానికి పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదని ప్రజలు అంటుకున్నారని చెప్పారు. డబ్బులు దొరక్క సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నోట్ల రద్దుతో ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. బ్యాంకు ముందు మోదీ తన తల్లిని నిలబెట్టారు కానీ అంబానీ లాంటి వారిని నిలబెట్టలేకపోయారని అన్నారు. -
నోట్ల కష్టాలు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
నోట్ల కష్టాలు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న నోట్ల కష్టాలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సహకార బ్యాంకులపై ఆధారపడి గ్రామీణులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. కో-ఆపరేటివ్ బ్యాంకులకు తగిన మొత్తంలో నగదు పంపి సామాన్యుల నోట్ల కష్టాలు తీర్చాలని సూచించింది. అయితే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. రైతుల నగదు అవసరాలు తీర్చేందుకు సహకార బ్యాంకులకు సాయం చేయాలని బ్యాంకులకు అంతకుముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. ఈ విషయమై ఆర్బీఐ, నాబార్డ్, ప్రభుత్వ రంగ బ్యాంకులతో చర్చించామని పేర్కొన్నారు. చేనేత, చేతివృత్తుల సహకార సంఘాల్లో మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. -
నోట్ల రద్దుపై కౌంటర్ దాఖలు చేయండి
-
నోట్ల రద్దుపై కౌంటర్ దాఖలు చేయండి: హైకోర్టు
హైదరాబాద్: పాత పెద్ద నోట్ల రద్దుపై కౌంటర్ దాఖలు చేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ-తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్ ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అయితే పాత పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని మధురై, కర్ణాటక కోర్టులు సమర్థించారని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఫ్యాక్స్ ద్వారా కాకుండా నోటిఫికేష్ ద్వారా కూడా నోట్లను రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉందని వాదించారు. నోట్ల రద్దుపై స్టే ఇచ్చే అవకాశం ఉంది కానీ ఇవ్వలేకపోతున్నామని హైకోర్టు పేర్కొంది. నోట్ల కష్టాలతో ప్రజలతో పాటు తాము కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడించింది. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది. రూ.1,000, రూ.500 నోట్ల రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8న జారీ చేసిన నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైదరా బాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వర రావు, న్యాయవాది కె.శ్రీనివాస్‌లు వేర్వేరుగా పిటి షన్లు దాఖలు చేశారు. కేంద్రం నగదు ఉపసంహరణను రూ.10 వేలకు, వారానికి గరిష్టంగా రూ.20 వేలకు పరిమితం చేయడంపై మాజీమంత్రి మైసూరారెడ్డి హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. -
‘ఎక్కడ చూసినా తొక్కిసలాటలు’
తిరుపతి: నోట్ల కష్టాలతో ప్రజల ఆక్రందనల్ని తమ గొంతు ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం ఉక్కు పిడికిలితో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. శాంతియుతంగా నిరసన చేసిన తమపై దౌర్జన్యాలు చేయిస్తోందని మండిపడ్డారు. సోమవారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ... చేతులకు సంకెళ్లు వేయగలరేమో కానీ గళాలకు సంకెళ్లు వేయలేరని స్పష్టం చేశారు. నోట్ల కష్టాలతో ప్రజలంతా ఆక్రందనలు చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతా బాగున్నట్టుగా ప్రచారం చేసుకోవడం శోచనీయమన్నారు. ‘నల్లధనం వెలికి తీయాలనే సంకల్పం గొప్పదే. పెద్ద నోట్ల రద్దును ఆహ్వానిస్తున్నాం. నవంబర్ 8న ప్రధాని మోదీ చేసిన ప్రకటనను మనస్పూర్తిగా స్వాగతించాం. ఆ తర్వాతే అసలు సమస్యలు ప్రారంభమయ్యాయి. గగ్గోలు మొదలైంది. ఎక్కడ చూసినా తోపులాటలు, తొక్కిసలాటలు. నోట్ల కష్టాలతో దాదాపు 100 మంది మరణించారు. ముందస్తు సన్నాహాలు చేసి పెద్ద నోట్లను రద్దు చేసివుంటే ఈ దురవస్థ రాకుండా ఉండేది. ఊరంతా నిప్పు ఎందుకు పెట్టారయ్యా అంటే దోమల్ని చంపడానికి అన్న చందంగా పరిస్థితి తయారైంది. 9 నెలల వరకు నోట్ల కష్టాలుంటాయని ఆర్థిక నిపుణులు ఉటంకిస్తున్నారు. బీజేపీ అంటే భయంకరంగా జనాన్ని పీడిస్తున్న పార్టీ, టీడీపీ అంటే తెలివిగా దేశాన్ని దోచుకుంటున్న పార్టీ. ముందే లీకులు అందించడంతో లీకు వీరుడు చంద్రబాబు తన దగ్గరున్న లక్ష కోట్ల ధనాన్ని తెలివిగా తెల్లధనంగా మార్చుకున్నారు. మోదీని ఏమీ అనలేక బ్యాంకర్లపై చంద్రబాబు దాడి చేస్తున్నార’ని భూమన అన్నారు. -
‘ఎక్కడ చూసినా తొక్కిసలాటలు’
-
అది కేసీఆర్ సొంత ఇల్లు కాదు: గుత్తా
నల్లగొండ: పాత పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బడాబాబుల చర్యలు తీసుకుని నల్లధనం వెలికితీస్తే ప్రధాని నరేంద్ర మోదీకి క్రెడిట్ దక్కేదని చెప్పారు. తాను రాసిన లేఖ వల్లే కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లు రద్దు చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నారని, ఆ లేఖలో ప్రత్యామ్నాయాలు కూడా రాసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కొత్త క్యాంపు కార్యాలయంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. క్యాంపు ఆఫీసు కేసీఆర్ సొంతిల్లు కాదని, ప్రభుత్వ భవనమని స్పష్టం చేశారు. కాగా, హైదరాబాద్ లోని బేగంపేటలో కొత్తగా నిర్మించిన అధికార నివాస భవన సముదాయంలోకి గురువారం తెల్లవారుజామున 05.22 నిమిషాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు గృహప్రవేశం చేశారు.