టీనగర్, న్యూస్‌లైన్: పత్రికా విలేకరులపై దాడి కేసులో పోలీసులు డీఎంకేకు చెందిన 11 మందిని అరెస్టు చేసి పుళల్ జైలుకు తరలించారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ తన పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పుకార్లు షికార్లుచేశాయి. పత్రికా విలేకర్లు, టీవీ రిపోర్టర్లు వార్తల సేకరణకు ఆళ్వారుపేటలోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడున్న డీఎంకే కార్యకర్తలు విలేకరులపై దాడికి తెగబడ్డారు. దీనిపై తేనాంపేట పోలీసులకు షబ్బీర్ అహ్మద్, ప్రియంవద ఫిర్యాదు చేశారు. తేనాంపేట పోలీసు ఇన్‌స్పెక్టర్ శరవణన్ పత్రికా విలేకరులపై దాడిచేసిన 11 మంది డీఎంకే కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టయిన వారందర్నీ సైదాపేట మేజిస్ట్రేట్ ఇంట్లో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ జూన్ రెండో తేదీ వరకు వారికి కోర్టు కస్టడీలో ఉంచాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు.
దీంతో 11 మందిని సోమవారం ఉదయం ఆరు గంటలకు పుళల్ జైలులో నిర్బధించారు. 11 మంది వివరాలు ఇలా ఉన్నాయి. 1.మురళి (30), యువజన విభాగం కార్యదర్శి, కాట్టు పాక్కం, పూందమల్లి. 2.అరుల్‌దాస్ (37) 111వ డివిజన్, యువజన సంఘం కార్యదర్శి, థౌజండ్‌లైట్స్. 3. కమలకన్నన్ (37) యువజన విభాగం కార్యదర్శి, థౌజండ్‌లైట్స్. 4. జయప్రకాష్ (33) యువజన విభాగం కార్యదర్శి, తిరువళ్లూర్ నగర్ తిరువాన్మయూర్. 5. సెంథిల్ కుమార్, మాజీ యువజన సంఘం ఉప కార్యదర్శి, థౌజండ్‌లైట్స్. 6. దేవకుమార్ (43) ఆల్వార్‌పేట. 7. మురుగన్ (24) ఆల్వార్‌పేట, 8. అశోక్ (26) కాట్టుపాక్కం. 9.రాజేష్ (31) కాట్టుపాక్కం, 10. విన్సెంట్ బాబు, 117వ డివిజన్, యువజన విభాగం కార్యదర్శి త్యాగరాయనగర్. 11.వినాయక మూర్తి, 119వ డివిజన్, యువజన విభాగం కార్యదర్శి, టీనగర్ ఉన్నారు.
విలేకరులపై దాడికేసులో 11 మంది అరెస్ట్
Published Mon, May 19 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement
Advertisement