జర్నలిస్టులపై మరోసారి దాడికి యత్నం | Lawyers attack journalist again at Delhi court ahead of JNU leader Kanhiya Kumar's hearing | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులపై మరోసారి దాడికి యత్నం

Published Wed, Feb 17 2016 2:56 PM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

జర్నలిస్టులపై మరోసారి దాడికి యత్నం

జర్నలిస్టులపై మరోసారి దాడికి యత్నం

న్యూఢిల్లీ : న్యాయవాదులు మరోసారి జర్నలిస్టులపై దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో బుధవారం  ఢిల్లీలోని  పాటియాల కోర్టు వద్ద  బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుప్రీంకోర్టు వెలుబడిన కొద్దిసేపటికే న్యాయవాదులు రెండు వర్గాలు విడిపోయి పోటా పోటీ నినాదాలు చేస్తూ ఘర్షణకు దిగారు. ఈ సంఘటనలో పలువురు గాయడ్డారు.

కాగా జేఎన్‌యూ విద్యార్థులకు వ్యతిరేకంగా కొందరు లాయర్లు నినాదాలు చేశారు. తాము గుండాలం కాదని, దేశభక్తులంటూ ఘర్షణకు దిగిన ఓ వర్గం లాయర్లు నినాదాలు చేశారు. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ విచారణ సందర్భంగా సుప్రీం చేసిన ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయుకుండా న్యాయవాదులు ఘర్షణకు దిగటం గమనార్హం.

అయితే ఈ  ఘర్షణ వాతావరణాన్ని ఫోటోలు తీస్తున్న 'ఫస్ట్ ఫోస్ట్' జర్నలిస్టుపై లాయర్లు దాడి చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమపై లాయర్లు దాడి చేస్తుంటే పోలీసులు సైతం చూస్తుండిపోయారని జర్నలిస్టులు వాపోయారు. తమకు కోర్టు వద్ద కూడా భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  తాజా పరిణామాలతో కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాగా జర్నలిస్టులపై దాడి ఘటనకు సంబంధించి పది నిమిషాల్లోగా నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు...పోలీసులను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement