బెంగళూరు : ప్రసిద్ధి చెందిన కంపెనీల్లో పని చేసినట్లు నకిలీ అనుభవ ధ్రువీకరణ పత్రం (ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్), రిలీవింగ్ లెటర్స్ ఇచ్చి మోసం చేస్తున్న నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసినట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి చెప్పారు. వారికి సహకరించిన మరో 20 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం ఆయనిక్కడ మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. సౌత్ ఎండ్ సర్కిల్‌కు చెందిన కిరణ్‌కుమార్ జయనగర 9వ బ్లాక్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో ఇన్ఫో మ్యాట్రిక్ కన్సల్టెన్సీ సర్వీసెస్ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించాడు.
కృష్ణారెడ్డి లేఔట్ నివాసి రంగరాజు, బిస్మిల్లా నగర్ వాసి షేక్ అబ్దుల్ అల్తాజ్ అహమ్మద్, సుల్తాన్‌పాళ్య వాసి బాలరాజుల సాయంతో నిరుద్యోగులను సంప్రదించాడు. ప్రముఖ కంపెనీల పేర్లతో ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు, శ్యాలరీ సర్టిఫికెట్లు ఇస్తే ప్రసిద్ధి చెందిన కంపెనీల్లో ఎక్కువ జీతాలు వస్తాయని నమ్మించి, వారి నుంచి భారీగా డబ్బులు రాబట్టాడు. నిరుద్యోగులకు ఐడీ కార్డులు, నకిలీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు, రిలీవింగ్ లెటర్లు ఇచ్చాడు. ఇలా సుమారు 20 ప్రముఖ కంపెనీల పేర్లతో ధ్రువీకరణ పత్రాలు ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బెంగళూరు సీసీబీ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి కంప్యూటర్లు, ఐడీ కార్డులు, లెటర్‌హెడ్‌లు, 25 ఫోన్‌లు, సిమ్‌కార్డులు, నకిలీ ఐడీ కార్డులు, రిలీవింగ్ లెటర్‌హెడ్‌లు, నకిలీ ఎక్స్‌పీరియన్స్ లెటర్స్, సీల్‌లు స్వాధీనం చేసుకున్నారు.
హైటెక్ నిందితుల అరెస్ట్
Published Wed, Oct 1 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement
Advertisement