అభివృద్ధి పనులను చేపట్టేందుకు వీలుగా ఎమ్మెల్యే కోటా నిధులను విడుదల చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కు బీజేపీ విన్నవించింది.
న్యూఢిల్లీ: అభివృద్ధి పనులను చేపట్టేందుకు వీలుగా ఎమ్మెల్యే కోటా నిధులను విడుదల చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కు బీజేపీ విన్నవించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు హర్షవర్ధన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం ఆయనకు ఓ వినతిపత్రం సమర్పించింది. ఇందుకు స్పందించిన ఎల్జీ.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. ఎల్జీతో భేటీ అనంతరం హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ చాలీచాలని విద్యుత్, నీటి సరఫరాతోపాటు పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరామన్నారు. ప్రైవేటు విద్యుత్ సంస్థలు, వాటర్ ట్యాంకర్ మాఫియా నగరవాసుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. చాలీచాలని విద్యుత్, నీటి సరఫరాతోపాటు పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరినట్టు తెలిపారు. ప్రైవేటు విద్యుత్ సంస్థలు, వాటర్ ట్యాంకర్ మాఫియా నగరవాసుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు.
సాధికార కమిటీని నియమించండి
ప్రజారవాణా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సాధికార కమిటీని నియమించాలని కూడా ఎల్జీని కోరినట్టు తెలిపారు. ఈ కమిటీ ఎల్‌జీ నేతృత్వంలో ఏర్పాటు కావాలని, ఢిల్లీతోపాటు జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో ఎదురవుతున్న సమస్యలకు సంబంధించి సదరు కమిటీ మూడు నెలల్లోగా తన నివేదికను సమర్పించాలని కోరామన్నారు. నగరానికి పటిష్టమైన ప్రజారవాణా విధానం అవసరమని పేర్కొన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ప్రజారవాణా విధానాన్ని రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఒకవైపు వాహనాల సంఖ్య పెరగడం, మరోవైపు ఆక్రమణలు పెరిగిపోవడం... పెద్దసంఖ్యలో ప్రమాదాలు జరగడానికి కారణమవుతోందన్నారు. నగరంలో ఫుట్‌పాత్‌లు మాయమైపోయాయన్నారు. ఇది కూడా ప్రమాదాలకు హేతువవుతోందన్నారు. రాజధాని నగరంలో ప్రైవేటు బస్సులకు టెర్మినల్ లే దన్నారు. రోడ్డుప్రమాదాలకు ఈ బస్సులు కూడా కారణమవుతున్నాయన్నారు. వీటిని ట్రాన్స్‌పోర్టు మాఫియా నడుపుతోందన్నారు. వీటి సేవలను నియంత్రించేందుకు తాత్కాలిక నిషేధాజ్ఞ ఉండాలన్నారు.