ప్రత్యేక బస్సుతో బీజేపీ ఎన్నికల ప్రచారం | BJP election campaign Special buses | Sakshi
Sakshi News home page

ప్రత్యేక బస్సుతో బీజేపీ ఎన్నికల ప్రచారం

Published Sun, Dec 14 2014 10:05 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

BJP election campaign Special buses

 న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికలు ఏక్షణంలోనైనా జరిగే అవకాశముండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కమలదళం శతవిధాలా యత్నిస్తోంది. ఇందులోభాగంగా మెహ్రౌలీ ప్రాంతంలో బీజేపీ ప్రత్యేక బస్సును ఏర్పాటుచేసింది. ఈ బస్సులో ఎల్‌సీడీ టీవీతో మెహ్రౌలీ నియోజకవర్గంలో తమ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేస్తోంది. ఈ బస్సుకు మిషన్ మెహ్రౌలి అని నామకరణం చేసింది. ఈ బస్సు ఈ నియోజకవర్గం పరిధిలో ప్రతిరోజూ మొత్తం 300 చోట్ల ఆగుతుంది. ఆగిన ప్రతిచోటా ఓ లఘుచిత్రాన్ని ప్రదర్శిస్తారు. ఇందులో 50 సీట్లు ఉంటాయి.  ఇందులోకి స్థానికులను అనుమతిస్తారు.ఈ చిత్రంలో పది నిమిషాలపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం ఉంటుంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement