
క్షమించండి
బెంగళూరు : శాసనసభలో ఉద్దేశపూర్వకంగా తన మొబైల్ ఫోన్‌లో ఉన్న ప్రియాంక గాంధీ ఫొటోను చూడలేదని ఔరద్ నియోజకవర్గ బీజీపీ ఎమ్మెల్యే ప్రభుచౌహాన్ పార్టీ క్షమ శిక్షణా సంఘానికి తెలిపారు. అయినా క్షమించమని కోరుతున్నానన్నారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖ పార్టీ క్రమశిక్షణా సంఘానికి చేరింది. అదేవిధంగా ఆండ్రాయిడ్ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేక పోవడం వల్ల తన ఫోన్‌లో ఉన్న క్యాండిక్రాష్ మొబైల్ గేమ్ తన ప్రమేయం లేకుండానే ప్రారంభమైందని మరో ఎమ్మెల్యే యూబీ బణకార్ పార్టీకు లేఖ రాశారు.
ఈ విషయమై పార్టీ క్రమశిక్షణ సంఘం ఈనెల 29న నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా, శీతాకాల శాసనసభ సమావేశాల సందర్భంగా వీరిరువురూ సభ కార్యక్రమాలు జరుగున్న సమయంలోనే మొబైల్‌ను ఉపయోగిస్తూ మీడియా కంటపడ్డారు. ఇందుకు సమాధానం ఇవ్వాల్సిందిగా గతంలో పార్టీ వీరిద్ధరికీ నోటీసులు జారీ చేసింది.