సాక్షి, ముంబై: భవనాల టెర్రెస్‌పై షెడ్డు నిర్మించేందుకు ఆయా సొసైటీల యాజమాన్యాలకు అనుమతివ్వాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) యోచిస్తోంది. అందుకు అవసరమైన నియమ, నిబంధనల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ అంశంపై వచ్చే సభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుని మంజూరు నివ్వనున్నట్లు స్థాయి సమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే తెలిపారు. సాధారణంగా భవనాల్లో ఆఖరు అంతస్తులో ఇళ్లు కొనుగోలు చేయాలన్న లేదా అద్దెకు ఉండాలన్నా ప్రజలు జంకుతారు. వేసవి కాలంలో టెర్రెస్ వేడెక్కుతుంది. ఫలితంగా ఇంట్లో విపరీతమైన వేడిమి, ఉక్కపోత భరించలేని విధంగా ఉంటుంది. సాయంత్రమైందంటే టెర్రెస్‌ను నీటితో తడపాల్సి ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలంలో లీకేజీ బెడద, గోడలు తడిగా మారడంతో విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది.
ఈ బెడద నుంచి తప్పుకునేందుకు సొసైటీల్లో ఆఖ రు అంతస్తులో ఫ్లాట్‌గాని చాళ్లలో ఇళ్లు గాని కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనకడుగు వేస్తారు. వీటి నుంచి ముంబైకర్లకు విముక్తి కల్గించేందుకు టెర్రెస్‌లపై షెడ్డు నిర్మించుకునేందుకు సొసైటీ యాజమాన్యాలకు అనుమతివ్వాలని యోచిస్తున్నట్లు శేవాలే స్పష్టం చేశారు. ఒకవేళ స్థాయి సమితి సభలో మం జూరు లభిస్తే నివాసులకు వేసవి, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి విముక్తి లభించనుంది. బీఎంసీ నియమాలు కొంత కఠినంగా ఉండడంవల్ల షెడ్డు నిర్మాణానికి అనుమతిచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈనియమాల్లో మార్పులు చేసి అనుమతిచ్చేందుకు మార్గం సుగమం చేయాలని బీఎంసీ యోచిస్తోంది. దీని కారణంగా బీఎంసీ ఖజానాలోకి అదనంగా రెవెన్యూ వచ్చి చేరనుంది.
టెర్రెస్‌పై షెడ్డులకు గ్రీన్‌సిగ్నల్
Published Mon, Mar 3 2014 10:53 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement